పుట:Sri Suryaraya Vidyananda Library-Pithapuram.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పండితులు మొక్కపాటి సుబ్బారాయుడుగారు, మొక్కపాటి వారి అధ్యాపనమే సూర్యారావుగారిలో మాతృభాషపై అభిమానం, గౌరవం మొలకెత్తడానికి తోడ్పడింది. తదనంతరం సంస్థానాధిపత్యం సూర్యారావుగారిని వరించిన తరువాత ఆయన చేసిన భాషాసేవకంతా మొక్కపాటి వారు చేసిన బీజావాపనమే కారణం. సుబ్బారాయుడుగారిని మొదట తనకు ఆంతరంగిక కార్యదర్శిగా తీసుకొని, తరువాత దివానుగా చేశారు. నాకు దొరికిన సమాచారం మేరకు సుబ్బారాయుడుగారు దివానుగా ఉన్న కాలంలో సూర్యారావుగారు 26 తెలుగు పుస్తకాలను ప్రచురించారు. ఎందరో రచయితలకు పుస్తక ముద్రణ కొరకు సహాయం చేశారు. ఆ రోజుల్లోనే అంటే 1920 ప్రాంతాలలో తెలుగు టైప్ మిషనన్ను తయారుచేయించారు.

సూర్యారావుగారు తెలుగు ప్రాచీన సాహిత్యాన్ని క్షుణ్ణంగా అవలోహన చేసినవారు. వారు చాలా కొద్ది రచనలు చేశాడు. అవి ప్రధానంగా వారు ప్రచురించిన పుస్తకాలకు పీఠికల రూపంలో ఉన్నాయి. సర్వజ్ఞ సింగభూపాలుని 'రత్నపాంచాలిక' నాటకం తెలుగు అనువాదానికి గ్రాంథిక భాషలో ఆయన మంచి పీఠిక రాశారు.

జయంతి రామయ్య పంతులుగారు (1860-1941) తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం సమీపమందలి ముక్తేశ్వరంలో జన్మించారు. ఇంగ్లీషు చదువుకొన్నారు. పిఠాపురంలోని మహారాజా పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు. న్యాయవాది పరీక్షలో ఉత్తీర్ణులై, రెవిన్యూశాఖలో చేరి త్వరలోనే డిప్యూటీ కలెక్టర్ అయ్యారు. 1911 నుండి 1913 వరకు మద్రాస్ ప్రెసిడెన్సీ మేజిస్ట్రేట్ గా పనిచేశారు. అంత తీవ్రమైన ఉద్యోగపు బొత్తిళ్లలో ఉండి కూడా రామయ్యగారు భాషాభిమానాన్ని వదలక, సాహిత్య రంగంలోనూ తీవ్ర కృషి చేశారు. ఎన్నో పరిశోధనాత్మక వ్యాసాలు రాశారు. శాసనాలను ఎన్నింటినో పరిష్కరించి ప్రచురించారు.

పంతులు గారు మద్రాసులో ఉన్నప్పుడు ఆంధ్రభాషా వాజ్మయాభివృద్ధికి ఒక మహాసంఘాన్ని ఏర్పరచవలసిన ఆవశ్యకత గురించి నొక్కి చెబుతూ ఆంధ్రపత్రిక ఉగాది సంచికలో ఒక వ్యాసం రాశారు. దీనికి స్పందించి పిఠాపురం మహారాజా సూర్యారావు బహద్దరు వారు (1885 - 1964) తమ మద్రాసు బంగాళా 'డన్మోర్ హౌస్'లో 26-3-1911 నాడు ఒక చిన్న సభ ఏర్పాటు చేశారు.

సభచిన్నదే కానీ విచ్చేసినవారు మహామహులు. కందుకూరి వీరేశలింగం, వేదము వేంకటరాయశాస్త్రి, మొక్కపాటి సుబ్బారాయుడు (పిఠాపురం దివాన్), చెన్నాప్రగడ భానుమూర్తి, గోటేటి కనకరాజు, వావిలికొలను సుబ్బారావు, కొమఋజు వేంకటలక్ష్మణరావు ఇలాంటి దిగ్గజాలు ఆ సభలో ఉన్నారు. ఆ సభలో ఆంధ్రభాష, ఆంధ్రవాజ్మయం అభివృద్ధికి ఒక సంఘం అవసరం అని జయంతి రామయ్య అలాంటి సంఘమే ఏర్పడితే ఈ సంఘం ఆధ్వర్యంలో సమగ్రమైన నిఘంటు నిర్మాణం జరగాలని వీరేశలింగం ప్రతిపాదించారు. ఈ రెండు ప్రతిపాదనలు సాధ్యమైనంత త్వరలో

13