పుట:Sri Suryaraya Vidyananda Library-Pithapuram.pdf/1

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సందేశము

శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం 1915 సం||నందు స్థాపించబడి 2015 నాటికి వంద సంవత్సరములు పూర్తిచేసుకొనుట ఆనందదాయకము. ఈ గ్రంథాలయము నందు అరుదైన పురాతన గ్రంథములు లభించుట వలన ఎంతోమందికి విలువైన జ్ఞాన సముపార్జన చేసే అవకాశం కలుగుచున్నది.

కీ||శే|| శ్రీ చెలికాని భావనరావు గారు ఈ గ్రంథాలయాభివృద్ధికి ఎంతో కృషి చేసారు "గ్రంథాలయ శతవార్షికోత్సవ ప్రత్యేక సంచిక" ను కమిటీవారు ముద్రించుట ముదావహము.

రాబోయే కాలంలో కూడా పాఠకులు ఈ గ్రంథాలయమును సందర్శించి జ్ఞానాభివృద్ధితో పాటు, గ్రంథాలయాభివృద్ధికి కృషిచేస్తారని అభిలషిస్తూ నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను.


డా|| ఉమర్‌ఆలిషా, పీఠాధిపతి.
శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము.