5
యు ద్ధ కాం డ ము
యోరామ ! వీరె మీ - కొప్పగింపుదురు
ననువంటి యాప్తుఁడుం - డఁగ నిట్టి వీర
వనచరబలము కై - వశముగానుండ
నిది ఘన మిదికొంచ - మిది నాకు సాధ్య
మిది యసాధ్యము చేత - నిదియగు చేత
యిదిగాదు నాకను - నెన్నిక యేల !
ఇది చూడు మొకసెల - విచ్చి యిందఱును 90
రణకోవిదుఁడ వీవు - రఘువీర ! నీకుఁ
దృణమాత్రుఁడైన దై - తేయ నాయకుఁడు
నెదిరింప "నేర్చునే ? - యింద్రాదులైన
కదనంబులోనిల్వఁ - గలరె నీయెదుర ?
అట్టి నీప్రాపున - నగచరులెల్లఁ
జుట్టవేసుక లంక - సుడిసిన యపుడె
రావణుఁ బొరిఁగొని - రఘురామ ! నీదు
దేవి నీఁగలరు సం - దేహమేమిటికి !
పార్థివు లుత్సాహ - పరులుగాకున్న
వ్యర్థంబులగు వారి - యత్నంబు లెల్ల 100
ధరణీశులేయూరు - తాల్మియేయూరు ?
మఱువు మీచింత దీ - మసముఁగైకొనుము.”
అని విని యగుగాక - యని హనుమంతుఁ
గనుఁగొని జూనకీ - కాంతుఁడిట్లనియె.
-: శ్రీరాముఁడు లంకనుగూర్చి రావణుని సేనావిశేషంబుల గూర్చి హనుమంతు నడుగుట :-
"తపముచేనైన కో - దండపాండిత్య
నిపుణత చేత నే - నియుఁ గట్టకట్టి