పుట:Sri Ramayanamu - Aranya and Kishkindha Kandas.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆరణ్యకాండము

17

నుండగోరెద మాకు- నొకయెడ నాన
తిండు వసింప నెం- దే విచారించి"370
యనిన రామునిఁ జూచి - యామునిరాజు
మనసులో నలరి క్ర - మ్మర నిట్టులనియె.

-: శరభంగుఁ డగ్నిప్రవేశముఁజేసి బ్రహ్మలోకమున కరుగుట :-


“అనఘ రాఘవ! ఇమ్మ - హాశ్రమంబునకు
ననతిదూరము సుతీ - క్ష్ణా శ్రమం బొప్పు
నమ్ముని కడకేఁగి - యతనితో మీర
లిమ్మన్న కడకేఁగి - యిమ్ము మీకిచ్చు
చని వేఁడుఁ డొకయింత - సయిరించి నన్నుఁ
గనుఁగొని తరవాతఁ - గదలుఁడు మీర
విదియె మందాకిని - యియ్యేటి యోరఁ
గదలి యమ్మునిఁగన్న - గాంతురు శుభము !380
ఇప్పుడే చనియెద - నేనని యతఁడు
కుప్పసంబూడిన - కొదమ త్రాచనఁగ
కెరలెడు హోమాగ్ని - కీలల మేను
దరికొల్చి యంగంబు - దహనునకిచ్చి
యతఁడిచ్చు నొక కొమ - రాకారమంది
జతఁగూడు పావక - జ్వాలలు వెడలి
యనఘ పుణ్యులు నాహి - తాగ్నులు దివ్య
మునులును దేవతా - ముఖ్యులు నుండు
లోకంబులెల్ల నా - లోకించి మించి
యాకడ బ్రహ్మలో - కావాప్తి నతఁడు390