95
క. వర తాత్పర్యముతో నిటు, భరతాన్వయ విభుఁడు శుకుని పలుకులు విని స
త్వరతా యుతుఁడై శ్రేయ, స్కరతామతి నేమి యడిగె ? గణుతింపఁగదే ! (42)
క. ఒప్పెడి హరికథ లెయ్యవి చెప్పెడినో యనుచు మాకుఁ జిత్తోత్కంఠల్
గుప్పలు గొనుచున్నవి రుచు, లుప్పతిల న్నీమనోహరోక్తులు వినఁగన్. (43)
వ. అనిన విని సూతుం డిట్లనియె. (44)
క. తూలెడి కూఁకటితోడన, బాలురతో నాడుచుండి బాల్యమున మహీ
పాలుఁడు హరిచరణార్చన, హేలల తోడుతను నుండె నెంతయు నియతిన్. (45)
వ. అట్టి పరమ భాగవతుండైన పాండవేయునకు వాసుదేవ పరాయణుండైన శుకుం డిట్లనియె. (46)
సీ. వాసుదేవ శ్లోక వార్త లాలింపుచుఁ గాల మే పుణ్యండు గడుపుచుండు
నతని యాయువు దక్క నన్యుల యాయువు నుదయాస్తమయముల నుగ్రకరుఁడు
వంచించి కొనిపోవువాఁ డది యెఱుఁగక జీవింతుఁ బెక్కేండ్లు సిద్ధ మనుచు,
నంగనా పుత్ర గేహారామ విత్తాది సంసార హేతుక సంగసుఖముఁ
తే. దగిలి నర్తింపఁ గాలము తఱి యెఱింగి, దండధర కింకరుల వచ్చి తాడనములు
సేసి కొనిపోఁవు బుణ్యంబు సేయనైతిఁ, బాపరతి నైతి బిట్టుఁ బలవరించు. (47)
వ. అది గావున, (48)
సీ. అలరు జొంపములో నభ్రంకషంబులై బ్రతుకవే ? వనములఁ బాదపములు
ఖాదన మేహనాకాంక్షలఁ బశువులు జీవింపవే ? గ్రామ సీమలంచు
నియతిమై నుచ్ఛ్వాస నిశ్శ్వాస పవనముల్ ప్రాపింపవే ? చర్మభస్త్రికలును
గ్రామసూకర శునక శ్రేణు లింటింటఁ దిరుగవే ? దుర్యోగ దీనవృత్తి
తే. నుష్ట్రఖరములు మోయవే యురుభరములు, పుండరీకాక్షు నెఱుఁగని పురుషపశువు
లడవులందు నివాసములందుఁ బ్రాణ, విషయ భర వృత్తితో నుంట విఫల మధిప ! (49)
సీ. విష్ణు కీర్తనములు నినని కర్ణంబులు కొండల బిలములు కువలయేశ !
చక్రి పద్యంబులు చదవని జిహ్వలు కప్పల నాలుకల్ కౌరవేంద్ర !
శ్రీమనోనాథు వీక్షింపని కన్నులు కేకి పింఛాక్షులు కీర్తిదయిత !
కమలాక్షు పజకుఁ గాని హస్తంబులు శవము హస్తంబులు సత్యవచన !