పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

స్యందన కదంబ సమేతంబై కర్ణు కలహంబునుం బోలె మహోన్నత శల్య సహకారంబై సముద్రసేతు బంధనంబునుం బోలె నల నీప పణసాది ప్రదీపింతంబై భర్గు భజనంబునుం బోలె నానాzశోక లేఖాకలితంబై మరు కోదండంబునుం బోలెఁ బున్నాగ శిలీముఖ భూషితంబై నరసింహ రూపంబునుం బోలెఁ గేసర కరణ కాంతంబై నాట్యరంగంబునుం బోలె నట నటీ సుషిరాన్వితంబై శైలజా నిటలంబునుం బోలెఁ జందన కర్పూర తిలలకాలంకృతంబై వర్షాగమంబునుం బోలె నింద్ర బాణాసన మేఘ కరక కమనీయంబై నిగమంబునుం బోలె గాయత్రీ విరాజితంబై మహాకావ్యంబునుం బోలె సరస మృదు లతాకలితంబై వినతా నిలయంబునుం బోలె సుపర్ణ రుచిరంబై యమరావతీ పురంబునుం బోలె సుమనో లలితంబై కైటభోద్యోగంబునుం బోలె మధుమానితంబై పురుషోత్తమ సేవనంబునుం బోలె నమృత ఫలదంబై ధనజయ సమీకంబునుం బోలె నభ్రంకష పరాగంబై వైకుంఠపురంబునుం బోలె హరిఖడ్గ పుండరీక విలసితంబై నందఘోషంబునుం బోలెఁ గృష్ణసార సుందరంబై లంకానగరంబునుం బోలె రామమహిషీ వంచక సమేతంబై సుగ్రీవ సైన్యంబునుం బోలె గజ గవయ శరభ శోభితంబై నారాయణ స్థానంబునుం బోలె నీలకంఠ హంస కౌశిక భారద్వాజ తిత్తిరి భాసురంబై మహాభారతంబునుం బోలె నేకచక్ర బక కంక ధార్తరాష్ట్ర శకుని నకుల సంచార సమ్మిలీతంబై సూర్యరథంబునుం బోలె నురుతర ప్రవాహంబై జలదకాల సంధ్యా ముహూర్తంబునుం బోలె బహు వితత జాతి సౌమనస్యంబై యొప్పు నైమిశంబను శ్రీవిష్ణు క్షేత్రంబునందు శౌనకాది మహామునులు స్వర్గలోక జేగీయమానుండగు హరిం జేరు కొఱకు సహస్ర వర్షంబు లనుష్ఠానకాలంబుగాఁ గల సత్ర సంజ్ఞికంబైన యాగంబు సేయుచుండి రందొక్కనాఁడు వారలు రేపకడ నిత్య నైమిత్తిక హోమంబు లాచరించి సత్కృతుండై సుఖాసీనుండై యున్న సూతుఁ జూచి,(1-37)

శౌనకాది ఋషుల ప్రశ్న

కం. ఆ తాపసులిట్లనిరి వి, నీతున్ విజ్ఞాన భణిత నిఖిల పురాణ

వ్రాతున్ నుత హరిగుణ సం, ఘాతున్ సూతున్ నితాంత కరుణోపేతున్.(1-38)