పుట:SriAndhrakaviTharangeniSamput6.djvu/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దీనినిబట్టి లక్షణదీపికప్రతులలోఁ బాఠభేదము లున్నవనియు, నిస్సందేహముగాఁ గాలనిర్ణయము చేయుటకు లక్షణదీపిక యాధారము గాఁజాలదనియుఁ దేలుచున్నది.

కవికాలనిర్ణయమునకుఁ దోడుపడునని ఆరవీటివారివంశవృక్షము నీక్రింద నిచ్చుచున్నాఁడను.

(1) తాతపిన్నమ 1290
         |
సోమభూపాలుఁడు 1320
         |
రాఘవదేవ 1350
         |
(2) పిన్నమరాజు 1380
         |
బుక్కరాయలు 1410
         |
రామరాజు 1440
         |
శ్రీరంగరాజు 1470
         |
అళియరామరాజు 1500

అళియరామరాజు తనడెబ్బదేండ్లవయసున తళ్ళికోటయుద్ధములో క్రీ. శ. 1565 వ సంవత్సరమునఁ జనిపోయెనని చరిత్రకారులు నిర్ణయించియున్నారు. దానిని బట్టి యాతనిజననము 1500 ప్ర్రాంత మగుట నిశ్చయము. దాని ననుసరించి యాతని పూర్వులజననసంవత్సరములఁ బైనఁ గనుపఱచితిని.

పైవంశవృక్షమును బట్టి అళియరామరాయల ముత్తాత బుక్కరాయ లని స్పష్టమగుచున్నది. ఈవంశవృక్షములోఁ బిన్నమరాజు లిరువు రున్నారు. ఇందులో మొదటి పిన్నమరాజునకు సోమభూపాలుఁ డనుతనయుఁ డున్నమాట వాస్తవము. రెండవపిన్నమరాజునకు సోమభూపతి యనుకుమా