పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ వేంక దేశ్వర వచనములు

47

లైన దివ్యశరీరంబులు నిచ్చుచున్నాఁడవు. ఈరీతి సర్వజంతుల కవ్యా జాంతరసుఖంబులు గలుగఁగా మాకు నెక్కడ నున్న నేమి ? శ్రీ వేంక బేశ్వరా !

102

వేణునాదప్రియా !. నేను బంట నై నందుకు నీ కేమిగుఱి ? నా నుతుల వల్ల నీ కేమిలాభంబు గల్గె ? మఱియు నే మ్రొక్కంగా నై నఫలము నీ కేమిటికి ? నిన్నుఁగూర్చి యుపవాసతపంబులు చేయఁగా నీవు గట్టు కొనియెడిది యెంత ? మా నియమవ్రతంబుల చేత జన్మంబులు మఱియును 'మొలపించుచున్నాఁడవు, జీవునికి జన్మ మరణంబులు నిర్బంధం బులై తోచవు. ఇన్నిటికి నీవు కలుగంగా జంతువులకు సుఖదుఃఖంబు లనుభవింప సులభం బాయెను. నీవు దయానిధివి. నిన్నుం గొల్చిన వారికి నీవు కామధేను కల్పవృక్ష చింతామణులై :ఫలియింపం గంటిమి. శ్రీ వేంక టేశ్వరా !

103

యజ్ఞరక్షకా ! పాపంబు లూరకే యజ్ఞానులమై చేసితిమిగాక మీఁదదాఁచి పెట్టితిమా? పుణ్యంబు లని కొన్ని వినోదించి నీ కృపం జేయంగా ననుభవించెదముగాక మేము ఫలంబులు మొలవం బెట్టితిమా? యీ రెండు మాలోనుండి చేయించంగాఁ జేసిన సేఁతలు, అది మీ రెఱింగి యుండియును నిష్ఠురము గట్టుకొనక దాక్షిణ్యంబున కర్మంబు లనుచుమొదళ్లు కుదుళ్లు గదలించి మాయలు చేసెదరు. మీ దాసులైన వారు మిమ్ముఁ దలఁచిన మాత్రంబున దోషంబు లపహరించెదరు. మీ రెట్లు చేసిన నట్లౌను; లోకంబున 'రాజానుమతో ధర్మ' యనియండ్రు; మీ యనుగ్రహంబు మాకు మంచిది రక్షింపవే; శ్రీ వేంక టేశ్వరా ! .