పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

48

శ్రీ వేంకటేశ్వర వచనములు


99

సీతావల్లభా ! నా కవితాకన్యకు నీవు వరుండవు. డైనమానుషంబులు గణపొంతనములు. నా జిహ్వయే పెండ్లి పీఁట. నా మనస్సే తెర. నా సంతోషకళలే బాసికంబులు, నా భ క్తియే కంకణంబు. అక్షరంబులే తలంబ్రాలు. శబ్దంబు లే వాద్యఘోషణంబులు. స్మృతిస్వరంబు లే పేరం టాండ్రపాటలు. చూపులే మంగళ హారతులు. నా వాక్యంబు లే పువ్వు దండలు. నీ సహస్రనామములే బంధువులు. నీ యాత్మగుణంబు లే శోభన ద్రవ్యంబులుగాఁ గై కొని యీరీతి వివాహం బై తివి. ఇంక నా కర్మబంధంబు లూడెఁగదే నీ విట్టు పాణిగ్రహణంబు చేసికొంటివిఁక నీ దేవులు నీవును చిరంజీవులై యుండి సంగీత సాహిత్య నానాలంకారాది పుత్ర పౌత్రాభివృద్ధి వెలయుచు నీ దాసుల రక్షింపవే ; శ్రీ వేంకటేశ్వరా !

100

శ్రీపురుషోత్తమా ! కరిరాజుం గాచితివి. కొలువులోపల ద్రౌపది మానంబు నిల్పితివి. ప్రహ్లాదునిమాట లాలించితివి. శరణుసొచ్చిన విభీషణుని రక్షించితివి. రావణకుంభకర్ణాదుల వధియించి లంక నేలిం చితివి. పాతాళంబు బలికి నొసగితివి. ధ్రువునికి ధ్రువంబుగాఁ బట్టంబు గృపచేసితివి. నిన్నెవ్వ 'రెఱింగి నుతింతురు వారికి నీ పదవు లిచ్చి రక్షింతువు. శ్రీ వేంకటేశ్వరా !

101

కరుణాకటాక్షా ! ఎవ్వరెవ్వరి జన్మంబులు వారివారికి హితవులై తోచు చుండం జేసితివి. దేహత్యాగంబులు నిర్బంధముల వెడలిన తెఱంగున మనసులను సమ్మతింపఁ జేసితివి. పాపమూలం బయిన క్రీడనసమయం బులు నన్న పానాదిరుచులు స్త్రీ భోగంబులు సుఖంబులై తోచుచుండం 'జేసితివి. కర్మానుభవంబులై న పరలోక సౌఖ్యంబులు, తదనుగుణంబు