పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xvi

రచనమును జాలఁదర్వాతిదిగానే యున్నది. కాని యీతనిదేయగు[1] శ్రీపాదరేణుమాహాత్మ్యముగద్య మాతఁడు సంకీర్తనాచార్యుని మనుమఁడే యనఁదగి నట్లున్నది:— ఇవి సంకీర్తనాచార్య దౌహిత్ర రేవణూరి తిరుమల కొండ యాచార్యపుత్ర వేంకటాచార్య ప్రణీతంబైన శ్రీపాదరేణుప్రభావంబను నిస్సహాయ కావ్యంబునందు రంభాపురందర సంవాదంబనునది తృతీయోల్లాసము. ఇది తప్పయియుండునేమో! ‘సంకీర్తనాచార్యదౌహిత్రవంశ్య’ అని యుండఁదగునేమో!

గ్రంథ ముద్రణము

ఇప్పటి కిరువది యేండ్ల క్రిందట నే నీ వేంకటేశ్వర వచనములను బ్రాచ్యలిఖిత పుస్తక శాలలోని ప్రతులఁబట్టి యుద్ధరించి 'భారతి' పత్రికలోఁ బ్రకటింపఁ బూనితిని. అప్పటికి తాళ్లపాకవారు రచించిన వయియుండునని నే ననుమానించితినేకాని దాని కాధారమేదియు నాకుఁ గానరాలేదు. అప్పుడు ప్రకటించుటలో నే నిట్లు వ్రాసితిని.

“ఇవి తాళ్లపాకవారు రచించినవై యుండవలెను. వీనిలో విష్ణుభక్తి యూటలూరుచున్నది. ప్రాచీనములలో నింత రసవంతము, భక్తిభరితము నగు వచనరచన యసాధారణముగా నున్నది. కృష్ణమాచార్య సంకీర్తనములు శంకర వచనములు మొదలగునవి వ్రేళ్లలెక్కకుఁ జాలినని, యిట్టివి, కొన్నియున్నవి. వీనినెల్లఁ గ్రమముగా వెల్లడింపఁ గోరికపడుచున్నాను. సహృదయు లివి చవిగొందురుగాక!”

(భారతి - క్రోధన వైశాఖము)

‘భారతి’లో నట్లు ప్రకటించుచుండుటఁ జూచిన సహృదయులు గొందఱు నన్నావచనములెల్ల గ్రంథముగా ముద్రింపఁగోరిరి. అట్లే నేను వానిని మదరాసులో ‘నాంధ్రపత్రికా ముద్రణాలయము’ ననే ముద్రింపఁబూనితిని, నూటయిర్వది వచనములు 80 పుటలు ముద్రితములయ్యెను. అప్పుడు తిరుపతి శ్రీవేంకటేశ్వర దేవస్థానోద్యోగులోక


  1. ఇది తిరుపతి పాచ్యపరిశోధనశాల లైబ్రరిలోనున్నది. కృత్యనతరణికలేదు.