పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xvii

రిద్దఱు నామిత్రు లాగ్రంథము తిరుపతి దేవస్థానమువారు ముద్రించుచుండుట నా కెఱింగించిరి. రాగిరేకులపైఁ గవికాలమునఁ జెక్కఁబడియున్న యావచనముల నుద్ధరించి దేవస్థానమువారు ముద్రించునప్పుడవి మిక్కిలి నిర్దుష్టముగా నుండఁగలవని, వారు ముద్రించుచుండఁగానే నాత్రపడి ముద్రించుట వ్యర్థమనివెఱచి యాగ్రంథము బయల్పడిన తర్వాత నా ప్రకటన విషయము యోజించుకొన వచ్చునని యుపేక్షించితిని. అచ్చుపడిన యాఫారము లెల్ల నాంధ్రపత్రికా కార్యాలయముననే యుండెను. ౧౯౩౫ తర్వాతనే తిరుపతి దేవస్థానమువారి ముద్రణము ముగిసెను. అటుతర్వాతఁ గొన్నాళ్లకుఁ జూతునుగదా! అందు నలువదియేడు వచనములే ముద్రితములయి యుండెను. మఱిమూఁడేండ్లకు నేను తిరుపతివచ్చి పరిశీలింపఁగా దర్వాతి వచనములయునికి యెఱుఁగ రాలేదు. అవి యహోబలముననో శ్రీరంగముననో యడఁగి యుండఁ బోలును! ప్రాచ్యలిఖితపుస్తకశాలలోను, దంజావూరి సరస్వతీ భాండాగారములోను నున్నవచనములు సమకూర్చి చూడఁగా ౧౭౫ వచనములున్నవి. ఇంకఁగొన్ని లోపించియు నుండఁబోలును! నేను రెండు లైబ్రరీలలోని వచనములు సమకూర్చికొని యుంటిని. తిరుపతి దేవస్థానముద్రణము తప్పులతో నసమగ్రముగానేయుండెను. ఈ విషయము వివరించి తెలుపఁగా నప్పుడు శ్రీవేంకటేశ్వర ప్రాచ్య విద్యాలయమున డైరెక్టరుగానున్న సరస్వతీ హృదయాలంకారులు శ్రీమాౝ యమ్. కృష్ణమాచార్యులుగారు నా ముద్రణము పూరింపఁగోరిరి. వెదకఁగా మదరాసులోని యచ్చు ఫారములెట్లోయెక్కడో చెల్లిపోయినట్లు తెలిసెను. నాదగ్గఱ మిగిలియున్న యచ్చుమచ్చుఫారములబట్టి ౧౨౦ వచనముల మరలనిపుడుముద్రించుట, కడమయముద్రితములఁబూరించుట,జరపితిని. ఇట్లుదీనిని వెల్లడింపఁజూచునాఁటికి శ్రీకృష్ణమాచార్యులుగారుకీర్తిశేషులయిరి. శ్రీమాౝ పరవస్తు వేంకటరామానుజస్వామి యమ్. ఏ.

3