పుట:Sri-Shivananda-Lahari-Telugu.pdf/3

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పీఠిక


శ్రీ జగద్గురు శ్రీమచ్ఛంకరభగవత్పాదాచార్యుల వారిచే ముముక్షువులకుపయోగార్థమై రచియింపఁబడిన " శ్రీ శివానందలహరి " లో నిక్కడకుఁ చిరకాలము క్రిందఁగొన్ని శ్లోకములఁ దెనిగించితి. కార్యవశమున నేను ఓరుగల్లు (వరంగల్)నకు బోయినప్పుడు సంతతశివపూజా పరాయణులును నిరతాన్న ప్రదాతలును నుభయభాషాకవిమిత్రులును నగు శ్రీముదిగొండ శంకరార్యులవారిం దర్శించి వారికి నా తెనిఁగించిన పద్యముల వినిపింపఁగా నేతద్గ్రంథ పరిసమాప్తికి వారు నన్నెంతయో