పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూ త పురాణము


వశాం తర్గతములయిన వాచామగోచరుండైన ధూర్తగోపా లుని లీలావిలాసంబు లన్ని యు నా మనోగోచరంబులయ్యె.


ఈ తీరమునఁగదా కృష్ణుండు గొల్ల డై
మెలఁగుచు మందాల మేపినాఁడు
ఈ కూటమునఁగదా కృష్ణుండు రసికుఁడై
శారదరాసంబుఁ జల్పినాడు
ఈ గట్టున నెకదా కృష్ణుండు సుమనోజ్ఞ
వేణుగానంబుఁ గావించినాఁడు
ఈ యొడ్డున నెకదా కృష్ణుండు గోపికా
శ్రీ మాసధనము హరించినాఁడు

ఇచ్చట నెకదా కృష్ణుండు విచ్చలవిడి
సంచరించెడి శాత్రన సంహతులను
గ్రాచి వేపల్లె నిపంట కమ్ముగాఁగఁ
జేసినాఁ డతిదోస్సార చిత్రమహిమ.


అదే బృందావసవీధి యచ్చట నే యంబ్జాక్షుండు వంశంబుఁ గెం
బెదబిం జేరిచి చొక్కిపాడినది యాభిరాళి కన్మోడఁగా
మొదవుల్ నిట్టక నిల్వరాలు గరఁగన్ మోడుల్ చిగుర్సంగ శా
రద రాత్రంబులు విశ్వమోహనముగా రాణింపఁ గోణంగియై,


74