పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథ మా శ్వాస ము

సరిక్రొత్త గానిడ్డ జాజి పూఁబొదరిళ్ళు
                 తీరైన పెళ్ళి పందిళ్లు గాగ
జలజల పైరాలు చక్కవిచ్చిన పూలు
                 పైఁ జల్లుకొను తలంబ్రాలు గాగ
కసరెక్కి గీర లేక యె పొడు కోయిల
                  కూజితంబులు మంత్ర కోటి గాఁగ
చెవులు పండువు గాఁగఁ జిల్క గోర్వంకలు
                 పాడు పాట నివాళి పాట గాఁగ
ఎబ్బె మెఱగఁ జాలని గొల్ల గుబ్బెతలకు
                ముక్కుపొడి చల్లి తన నిగ్గు సోయగమున
మాటు పెళ్ళిళ్ళు చేసెడి మాయదారి
                వింతచర్యలు నా మనోవీధి కెక్కె,


తృణగుల్మావృతకూలసలముల సందీపించు "కాళిందిలో
మణీరోచిష్ణుత నొప్పు కాళియ ఫణా మధ్యపదేశంబునన్
ఘృణిరంజన్ మణి కింకిణుల్ మొజయ శ్రీకృష్ణుండు సర్తీంచుచున్
ఫణినిన్ వ్రేల్మిడి దోసిపుచ్చిన తడావాసస్థలం బిద్దియే.


కాలియందలి యందెలు గల్లు రసఁగఁ
జిందుఁ దొక్కుచుఁ దనతల్లి చేతికోలఁ
గాంచి కల్లారి కన్నీరు కార్చు నట్టి
నవ్య నవనీత చోరుండు నాకుఁ దోచె.

75