పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూత పురా ణ ము

ధర్మమధర్మమంచుఁ బెఱదారులు తొక్కుచు నాసలేక దు.
పర్శము లాచరించు కలి కాలపుఁ బెద్దలఁగాంచి తప్తుడై
మర్మము విప్పి చెప్పి మనుమామునన్ నడిపింపలోకమున్
నిర్మలుఁడైన సూతముని నీతులు పల్కెడు నాముఖంబునన్,


"తేఁకువ లేని నే నెటులఁ దిన్నని పల్కులు పల్క బూనెదన్
లోకులు సన్ను గూర్చి తమలో నెటులాడిన నాడుకొందు రౌ
గాక గురూపదిష్టమగు కార్యము గావున సాహసించి య.
స్తోక సుధీ ప్రభావుఁడగు సూతుఁడు చెప్పిన నేను వ్రాసెదన్.

ఓ జనులార ! నా మనవి యున్నది యొక్క-టి నాలకింపుడీ వ్యాజముతోఁ బురాణములు వ్రాసిరి పూర్వులు తద్విరుద్ధముల్ బ్రాజిలు నిందు సూతముని పల్కు-లు గావునఁ గాంచినంతనే యోజన సేయమాని పరుషోక్తులకుం జోరవద్దు తొందరస్.


మనసునచ్చు నెడల మన్నింపఁగోవచ్చు
మనసు నొచ్చు సకల మాననచ్చుఁ
గాని వినర మేమి కనకుండ వినకుండ
బరులఁ బ్రువ్వఁదిట్ట ఫలము కలదె ?


కవి విచార ము



చదివితి నేఁ బురాణముల సాంగముగా భయభక్తి యుక్తులన్
జదువుటె కాని యందుఁగలసందియముల్ సతతంబు హెచ్చుడున్
బొదలక చిత్తశాంతి పరిపూర్ణముగా భ్రమియింపుచుండ నా
మదిమదినుండదయ్యె నొక మార్గమ యేనియుఁదోఁచ దెమ్మెయిన్

66