పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కృత యుగము

కలియా ! విచారించిన బోధపడును. పజావననార్తము సన్యస్త రాజ్యుఁడై త్వక్త కళత్ర వుత్రకుఁడై, జీవిత కాలము సంతయుఁ గుడిచిన చోటఁ బండక, పండినచోట గుడువక వెచ్చించి కాలగోచరుఁడయిన బోధిసత్వునికాల మేయుగమునందుండ వలయును?


సర్వస్వమును సనాతన ధర్మా రాధనకయి సమర్పించి, దానందనివిఁ జెందక, నిర్మోహముతో, వీతభయముతో, నాత్మ సమర్పణముఁ గావించిన శ్రాద్ధానందసన్యాసి జీవితము, ఈర్ష్యా లోలుండయి పరులను జెడఁదిట్ట, శశప్తు డయిన వసిష్ఠుని జీవితమున కన్న ను నుత్తమము కాదా! ద్విగ్నము కాని చిత్తముతోఁ బాఠకమహాశయా ! పరిశీలింపుము. సంస్కృత గ్రంథములను వెనుక ముందు బిరుదులను తగిలించుకొన్న యట్టి వారెవ్వలో వ్రాసి పెట్టిరని చెప్పి యా గ్రంథములయందు వాకోసఁబడిన దంతయు ధర్మమని భ్రమప్రమాదమునకు లోనుగాకుము.

కృ త యు గ ము


ఏతన్మిమాంసకు వలయు పరికరములన్ని యుఁ బురాణ గాథలనుండి గ్రహింపఁబడినను, శ్రుతిస్మృతేతి హాసముల నుండి యేలఁదిగనో యిచట గ్రహింపఁబడుచున్నవి. కావున పాఠకులు సావధానముగ నాకర్ణింపఁ బ్రార్త్థింపఁబడుచున్నారు. యుగములను గూర్చియు యుగధర్మములను గూర్చియు విఫు


29