పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కృత యుగము


లముగా నిచట చర్చించి యేకాల మేయుగమగునో చూపింతుము,


కృతయుగమునందు సార్వభౌములు లేరు. బహుభాహు బలగర్వ విలీడుఁడయిన వీరుఁడెవ్వడో రాజ్యసముపార్జసముఁ చేసి రంతులు వైచుచుండును. జైత్రయాతలనుగూర్చీ చిత్ర గుప్తునివంటి వాఁ డెవ్వఁడో వ్రాయసమర్థుడు,, జాతి మత వివక్షతలు లేవు. గాంధర్వవివాహములు మెండు, తప్పిన, రాక్షస వివాహములు తఱచు. వివాహబంధ మామరణ ముండునది కాదు. వధూవరుల యిష్టానిష్టముల పై నాధారపడి యుండెను. జాత్యంతర వివాహములు జరుగుచుండెను. ఇవి వరుసలుకూడ నున్నట్టు కన్పట్టదు. తాత మనుమరాలీని నుద్వాహమగు నాచారము శిష్టాచారముగఁ బరిగణింపఁబడు చుండెను. ఓమరదుని తండ్రియయిన సుదర్శనుఁడు, అత్మజుని కూతురయిన ‘ఓమవతి' ని దగినవరుఁడు దొరకమిచేఁ బెండ్లి యాడెను. [1]1. ఏకగర్భజాతులు పెండ్లి చేసికొనుట దోషము కాదు. ఇంద్రియసంతృప్తిఁ గావించుకొనుట దక్క వివాహ సంబంధ మెట్టిదో యెరుగని స్త్రీ, పురుషు లుండిరి. విటీ విటుల వనవిహారములు, నెత్తమ్ములపై సయ్యాటలు మిక్కు టము, దీర్ఘముగ విచారించిన నాటి వివాహములు "నేటి పాశ్చాత్య దేశమందలి వివాహములట్లు పొడకట్టట్టు చున్నవి.

........................................................................................................................

1.


30

  1. భారతము. ఆకూతీరుచి ప్రజాపతి సంతానమయిన యజుఁడు, దక్షిణ యను వారు మిధునమయిరి.