పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాత పురాణము



హోతలు ఋక్కు లం జదుపు చుండఁగ మిక్కిలి శ్రద్ధతోడ ను
ద్గాతలు సామ వేదమును గానము సేయ మనోహరంబుగా
బాతిగ యాజ్ఞకుల్ సకల వస్తువులు సమకూర్చుచుండఁ బ్ర
ఖ్యాతిగ యజ్ఞగుండ సముఖంబున భూమివుఁడుండి డేవితో,



సమిధలను వేసి యజ్ఞ గుండమున మివుల
నాజ్యమునుబోసి యగ్ని చల్లారకుండ
వేల్చుచుండెను దుపద పృథ్వీవరుండు
భార్యతో బాటు పరవశత్వమునఁ జేసి,


యజ్ఞ ధూమంబు దిశ లెల్ల నానరింప
యజ్ఞగుండంబు మంటతో నావళింప.
జెవులు చిల్లులుపడుచుండఁ జెప్పఁదొడఁగి
రఖలమంతంబు లొప్పుగా నచటిమునులు,



ముగిసీ ముగియకమునుపే
బగబగ సవనాగ్ని యన్ని వైపులఁ బర్వెన్
సెగచే మొగములు మొగిడెన్
బొగచేఁ బ్రజు కన్నుదోయి మూఁతలుపడియెన్ |



కన్నుగవవిప్పి కనుగొన్న క్షణమునందె
మెఱుఁగు టొడలితో జన్నంపు టరుగుకడను
బాలుఁడొక్కండు మురిపెంపు బాల యోర్డు
నిలిచియుండిరి. మిఱుమిట్లు గొలుపునట్లు.



94