పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము


మసక వై చాయ దెస లెల్ల మసరుచుండ
గసటు లేని లావణ్యంబు గంతులిడఁగ
ముద్దు మూటలుగట్టడి ముద్దరాలు
బాలయొక్కర్తు నీటుతో బయలు దేర,


ఇదె యదనని తలపోసి ద్రు
పద భూపతి చారపాళి పఱిగొనవారిన్
గరిసి పయింబకి పట్టుక
పదపదమని 'పైసమయ్యెఁ బార్షతుకడకున్ .



వచ్చిన చారులు మ్రుచ్చిమి
దెచ్చిన బిడ్డలను గలక దేరిన మదితో,
జెచ్చెరఁ గనుగొని, పసదన
మిచ్చి యవలకంపి వారి నెల్లర బిదపన్,



పట్టరానట్టి సంతోష భావమునను
ముద్దు పసిబిడ్డ లిద్దరి మోముఁగాంచి
యేమిచేయంగఁ జేయాడ కేకతంబ
మిగుల యోజించి, యోజించి మెలవుతోడ.



శిష్టులఁ గూడి మంతనముఁ జేసి, పరాకిసుమంత లేక సం
తుష్టినిబొంది యంత తమ తోయమువారికిఁ జెప్పి వుత్రకా
మేష్టి నొనర్చి బిడ్డలను నెట్టులొ కాంచెదనంచుఁ గార్య సం
సృష్టమనంబునన్ బలికి చెచ్చెర దీక్షితుఁడై పునీతుఁ డై.


93