పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నూతపురాణము



కాంచి, హర్షించి, యేలిక మనోరథం బీ డేర్పఁజాలుదు
మని యెంచి, పొంచియుండ నొక్క రేయి..




తెల్లని వెన్నెల గాయఁగఁ
జల్లని పయ్యెరలుదోలు సమయమునందున్
సల్లాపించుచు వచ్చిరి
పిల్లలు కవ లారుబైట విహరింపంగన్ ,



మూఁడు బారలవిల్లు మూపు పై నానించి
పొదినిండ బాణముల్ పదిలపఱచి

కై బారు మొలభట్టి గట్టిగానిరికించి
బారు టీ లను బ్రక్క జూరవిడచి

గోనబుగాఁ దలమీఁదఁ గుల్లాయి సవరించి
మైయెల్ల గోపించు మరువుఁదొడిగి

చికిలి జేసినక త్తి చేతిలో ధరియించి
బొబ్బరించెడి గవ్వజబ్బం దాల్చి



గున్నటేనుఁగు మజపించు గునుకునడల
"మొలకలెత్తిడి చిఱునవ్వు మోముఁగప్పఁ
బదిపదా రేండ్లు గడచన్న బాలకుండు
శౌర్య సౌందర్యరాశి యచ్చటకువచ్చె.


92