పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వానము


పిన్న నాఁ డితండు క్షత్రియకులోచిత ధర్మంబగు విలు
విద్యను నేర్వ మున్యాశ్రమంబులకు జనీ యందు విలువిద్యం
గఱచుచుండ, భారద్వాజుఁడగు ద్రోణుండు సహపాఠియై
తనతో మెలంగుచుండఁ గొండొక్కనాఁడు ద్రోణునిం జేరంజీరి


"'నెచ్చెలీ ! మా పాంచాల దేశంబుసకు సభిషిక్తుండనై నేను రాజ్యంబుఁ జేయునప్పుడు నీవట కరుదెంచిన చో నిన్ను మన్నించి యభీప్సితంబుల నీడేర్తు "సని ముట్టంబలికి విద్యాభ్యాసంబుఁ బరిసమాప్తి గావించుకొని మగిడి పాంచాల దేశంబుఁ జేరి రాజ్యంబుఁ జేయుచుండ, ద్రోణాచార్యుండు కుటుంబభారం బుచేఁ గ్రుంగఁబడి, ద్రుపదుని వీడుచొచ్చి తన్నెరింగికొని తత్సన్ని ధానంబున నిలువంబడి, చిన్న నాటిమాటలు జ్ఞప్తికిఁ దెచ్చి తా వచ్చినపని వినిపించిన, ద్రుపదుండు -


ఓరకంటను బొడగాంచి యూరకుండి
యాప్తులనుగూడి పాచికలాడుచుండి
మాటలాడమి గిఱ్ఱున మగిడి ద్రోణుఁ
డచ్చటను బాసి సెడలి దురాగ్రహముస

.
తిన్నగ హస్తినాపురము తెన్ను నఁబోయి సురాపగానుతున్
గ్రన్నసఁ గాంచివచ్చిన ప్రకారము సర్వముఁ దెల్పి వానిచే
మన్న సలుదుచుక్ గురుకుమారులకున్ దగురీతి నొజ్జయై
యన్నము సుంత లేక ధనురాగమ మెల్లను నేర్పి పిమ్మటన్ .


89