పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామ స్వామి గారు

ఆంధ్రరాష్టోద్యమం ప్రచారం_గీతాలు:--
తెలుఁగుబిడ్డా మరచిపోకుర
తెలుగు దేశము పురిటి గడ్డర
కొక్కొరోకో' పాట బాడర
తెలుగువారల మేలుకోలపర మొదలైనవి.


శుద్ధిసంఘ కారణం...ఆర్యుల్లాగా, బ్రిటిషువారు తమ రాజకీయాధికారాన్నీ నిలబెట్టుకోటానికే మతాన్ని వాడటం. ఇది జరక్కుండా క్రిస్టియన్సని హిందూమతంలోకి చేర్చుకోవ టం. తెలుగుమంత్రాల్లో పెళ్ళిళ్ళు-మళ్ళీ ఉపన్యాసాలూ ప్రచారమూ!" వివాహవిధి: ' పుస్తక ప్రచురణం–ప్రతివీ అర్ధం కాని సంస్కృతంలో వుండబట్టేగదా అగ్రజాతి పాము ఖ్యము అందుకని మంత్రాలను మామూలుమాటలు చేశారు. తానే నడుంకట్టి "పెళ్ళిళ్లు చేయించటానికి పూనుకున్నారు. ఈ పెళ్ళిళ్లు చాలా త్వరలో పాప్యులర్ అయ్యాయి. ఎన్నో పెళ్ళిళ్లు చేయించారు. చేయిస్తున్నారు. ఒక పెళ్ళి చెయ్య టం ఒక ఉపన్యాసం ఇవ్వటం. ఇదీ పద్దతి...


'భగవద్గీత' ప్రచురణ:-భగవద్గీత హృదయం బ్రద్ద లైంది. భగవద్గీతా, భగవంతుడూ హాస్యాస్పదులయ్యారు. పరిహాసం సంఘసంస్కరణకు ఎంత బాగా ఉపయోగిస్తుందో ఈ పుస్తకం నిరూపిస్తుంది..


ఈ గీత ప్రబల శత్రువుల్నీ ప్రబలమిత్రుల్ని తయారు చేసింది. విమర్శకుల మాటలు విని రామస్వామిగారిలా


21