పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామ స్వామి గారు


ప్రధానమంత్రి; జస్టిస్ పార్టీ నాయకుడు - నాయకత్వానికి బొబ్బిలిరాజూ పోటీ! అందు కే తంజావూళ్ళో ఆ మీటింగు. ఇది జరక్కుండా చెయ్యాలని పట్టుదల, .. ఎక్కువ ప్రతినిధులు మునుస్వామిగారి పార్టీ వారే రావటంవల్ల, మీటింగు పెట్టటం ఆలస్యం చేశారు. మీటింగు పోస్టుపోన్ చేస్తారు అని పుకారు. ప్రజల్లో ఉద్రేకం పెరిగింది. గోడలు దూకారు. రామస్వామిగా రే ముందు! హాల్లో ప్రవేశించారు. ప్రతినిధులు రామస్వామిగార్ని ప్రెసిడెంటుగా ఎన్నుకున్నారు. తీర్మానాలు ప్యాసుచేశారు. మీటింగు సమాప్తి,


దీన్ని గురించి వ్యాఖ్యానం చేస్తూ రామస్వామి అనే ఒకరు' (One Ramaswamy) అని ఒక పత్రిక వ్రాసింది. రామస్వామిగార్ని బాగా తెలిసివుండికూడా బొబ్బిలిరాజకి ప్రతికూలంగా చేశారనే ఉద్దేశంతో అలావ్రాసింది. రామ స్వామిగారు అది చూశారు. మద్రాసువచ్చి ఆ పత్రిక ఆఫీనుకు వెళ్ళి, 'రామస్వామి అనే ఒకరు (One Ramaswamy ) అనీ విజిటింగ్ కార్డుమీద వ్రాసి ఎడిటర్ కి పంపారు. ఎడిటరు గబగబా తలుపులన్నీ బిగింపించుకున్నాడని వేరే చెప్పాలా ? "తంజనగరపు కోటగోడలు చెంగు చెంగున నిగురునప్పుడు కంచికోటల కంచుతలుపులు కంగుకంగున మ్రోయునప్పుడు”

. గీతం

"వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడో తేల్పుడీ ' పూసిపోదుము మెడను వైతుముపూలదండలుభక్తితో .. గీతం.


20