పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము


ద్రావిడులు విజ్జొ డై తమిళులు, తెలుఁగులు, కన్నడులు, మల
యాళులు మొదలగు జాతులుగఁ జీలి, దక్షిణాపథంబు నాల్గు
చెఱగుల నాక్రమించి, వెవ్వేరు నాగరికతయు భాషయుఁ
బ్రతిభయుఁ గలుగఁ గట్టుమాఱఁ జిరకాలం బరిష్టంబు లేకుండ
నేలుచుండ---


ఐక్యముతోడఁ బంచజను లందరు హాయిగనుండఁ జోళ చా
లుక్యముఖాది భూమిపతులున్ భువి నేలిరి కొంతకాలమే ,
జోక్యముకల్లనీక గుణశోభితులై నయపక్ష పాతికిన్
శక్యము కాని యట్టిపని సంభవమౌనె జగ త్రయంబుసన్



వారు 'కాలగోచరులైరి వారిపిదప
దేశ మల్లకల్లోలమై దిక్కు లేమిఁ
గారుచీకట్లు దిశ లెల్లఁ గమ్మికొనఁగ
బ్రజలు కళవళించి రుపద్రవముల చేత


తమిళ కేరళ తులువ రాష్ట్రముల పూర్వ
పుణ్య పరిపాకమునఁ జేసి పోసరించి
రచట నాయర్లు వెళ్ళాలు సతుల శౌర్య
విదిత కీర్తి భాసితులైన మొదలియార్లు.


తెలుగు దేశంబునందు దేదీప్యమాన
శక్తి రాజ్యంబుఁ జేసిరి 'సార భుజులు
వెలమ మన్నీలు రెడ్డి హంవీరవరులు - - -
కావు సరదార్లు నాయకుల్ కమ్మదోరలు


177