పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూత పురాణము


విక్రమాపష్టంభ విభవాతి రేకులై
                విదళించి కొట్టిరి నెలమదొరలు
సమర శౌర్యాటోప చండ ప్రచండు లై
                 కవ్వించి నెట్టిరి కమ్మదొరలు
నిర్ణిద్ర దోస్సార నిర్భిన్న వైరులై
                రెట్టించి మెట్టిరి రెడ్డి దొరలు
వైరి భీకర ఖడ్గ పాండితీదకులై
                కదియించి దట్టిరి కాపుదొరలు
శాత్రవానీక మారీతి సమసిపోవ
              దుర్భరావగ్రహ విపత్తి తొలఁగిపోవఁ
బ్రజలు బదికిరి తస్కరభయము లేక
              తెలుగుదొర లేలు మాగాని పొలములందు


వర్తమానంబుననుఁగూడఁ గీర్తిథనులు
వెల్లుచున్నారు పై వారు తెల్గు దేశ
మందుఁ బెట్టిపోషించెడు సట్టిశక్తి
నంగరంగ వైభవముల సంగవించి,


ఒక్క గతి పులి మేకయు నొక్క-రేవు
నందు నీరుఁ దా వెడునట్టు లధికశక్తి
న్యాయభావంబుతో దక్షిణాపథంబు
నెల్ల ద్రావిడ రాజన్యు లేలుచుండ.

78