పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూత పురాణము


ఒక్కయధర్మమున్ సలువకుండఁ బరా ర్తిని గోరకుండఁ గొం
డొక్క విధంబునన్ జెమటయోడ్చి ధనంబును గూడఁ బెట్ట నా
రొక్కము ద్రావిడ ప్రజకు మ్రుచ్చిలియో బలవంత పెట్టియో '
దక్కకయుండఁ జేయుటయే ధర్మమటంచు వచించిరార్యులున్ .



అంగద చిచ్చునార్చుకొననైన సనార్యులు పట్టెడేనియున్
బొంగలి ముట్టగూడ దొక పూటయుఁ జక్క-నిబట్టకట్టరా
దెంగిలికూడు సాపడియె యెప్పుడు తప్పక నెట్టిఁ జేయుచున్
గింగిరిపాతఁ గట్టుకొని కిట్టుటె ధర్మమటందు రార్యులున్ ,


జాత్యభిమాన దుర్విషయస క్త మనంబునఁ గూరకర్ములై
సత్యము ధర్మమున్ వదలి శత్రుల రాయు టె కర్జమంచుఁబా
తిత్యము మూటగట్టి కొని త్రిక్కక యార్యులు మంత్రతంత్రదౌ
ర్గత్య నిమగ్ను లై తలపరానివి కానివి చేసి 'రెన్ని యో !


కొమరుంబాయవు కండకావరమునన్ గోవాండ్రు దుర్ధుర్షు లై
భ్రమచే దావిడ కన్య కానివహ లావణ్యంబున కొక్కి డం
బముతోడన్ జెఱపట్టిసన్ స్మృతులహో ! పల్లెగుమా పైన ధ
ర్మము కాదంచును జెప్ప నేరవుకదా ! మర్యాదబద్ధంబులై ,


ఎల్లర దొడ్ల పెంట భుజియిం చెడి జంతువు లెన్ని యేని న
టిల్లును జొచ్చుచున్న నెవ రేమన రార్యులు, కాని జంకుతో
'మెల్లగ దావిడుల్ గడప మెట్టినమాత్ర కషాయితాక్షు లై
గొల్లునఁ దిట్టిపో సెదరు కూడదటంచు నచించు నేస్మృతుల్ !

70