పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వి తీయాశ్వాసము


పండు వెన్నెల మాపులఁ గాయు టెట్లు !
గండుకోయిల పాటలఁ గడచుటెట్లు?
అనుచుఁ గన్నీటిజాలులో వెనుక తిరిగి
వ్రేలుకావెడి మోముతో "వెడల నెంచి.


మూటలు ముల్లెలుం దలల మోపి భరంబునఁ దొట్రుపాటుతో
దోఁటలుదొడ్లను వదలీ దొక్కిసలాడుచు సందరేకమై
బాటలఁబట్టి పేరలపు వాయఁగఁ బాటలు చొక్కి పాడుచున్
బూటలు రోజులున్ నడచిపోయిరి కొండల నేటవాలుగా,


అమరనది దాఁటి ముదిగొండ నవతరించి
కొంద తీటునటు పరికించి కొట్టకోనకు
భరతవర్షంబు వీక్షించి పట్టపవలె.
మెట్టి రాంగి లేయులఁబోలెఁ బొట్టకొఱకు.


భరతవర్షంబుఁ జొరక యసురు లయోని
జప్రముఖ దేవయోనులు క్షిప్రగతిని
పశ్చిమాశాభిముఖముగాఁ 'బైనమైరి
కొల్లగొట్టంగ దేశంబు కొల్లయనుచు.


సింధు గంగా నదీ పుణ్యజీవనములం
బూఁచికాచిన తరుల తాపుంజములను
గలయఁ బరికింప మీఱుమిట్లుగొలుప నందె
సెలవు లేర్పఱచికొనంగ నిశ్చయించి,

53