పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నూతవురాణము


పకమబుభుక్షు చే నవసి భారతభూమిని జొచ్చి పిమ్మటన్
సురలను తొంటి షేర్విడిచి నూత్న సమాఖ్యను నార్య నామమున్
బిరిగొను వేడ్క దాల్చి పిరినీకును మాని క్రమక్రమంబుగా
గురుతర కాచుకష్టములకుం దలలొగ్గుచుఁ గీర్తి కాము లై .


చిదుగు కంపల నెల్లఁ బొదుపుగా నొక చోట
బెచ్చుగాఁ బెట్టి కార్చిచ్చు బెట్టి
పొడవుగాఁ పెరిగిన నిడుద చెట్టుల నెల్ల
గొడ్డళ్ళచేఁ బడగొట్టి వైచి
ఎండకన్నెరుగక యివతళించెడు నేల
పై నున్న యీరముల్ పాయఁద్రోసి
గుట్టమెట్టలుగాఁగ బిట్టుఁగా బడియున్న
పలుగుతో లన్నింటిఁ దొలఁగఁబుచ్చి


భరత భూమండలంబును 'వాసయృగ్య
మైనదానిగా నొగరిచి యచ్చటచట
నార్యు లాగ్రహారంబుల సవతరింప
జేయ సమకట్టి యద్భుతా మేయశక్తి,

జాంగలముల లాంగలములఁ జక్కఁ జేసి
యొక్క లిని మిక్కిలి వసించు నిక్క ( జేసి
యార్యకౌమారవర్గంబు కార్యనిరతిఁ
గాట్రగడ్డతోఁ బల్లె లఁ గట్టిరంత.


54