పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామ స్వామి గారు


వాదోపవాదాలు చెల రేగినవి, తిట్టారు, శపించారు. సంఘం తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కింది. సంఘంలో ఈ పుస్తకం కలిగించిన అలజడి మ రేపుస్తకం (శంబుక వధ తప్ప) కలిగించ లేదు. పది సంవత్సరాలు తిరిగి వచ్చేటప్పటికి మాత్రం ఈ పుస్తకాన్నే యింటర్ మిడి యేట్' కి పాఠ్యగ్రంథంగా పెట్టుకొన్నారు.


1914 లో ఇంగ్లండు ప్రయాణం. యుద్ధంరోజులు. బంధువుల నిరోధం, వినేస్వభావముంటేనా ? పైగా వెళ్ళ బోయే ముందు యెవరో తుమ్నారట. అందరూ బతిమా లారు; విన లేదు; బయలు దేరారు. లండనులో గాంధీ దర్శనం కృష్ణాపత్రికలో వ్యాస పరంపరలు__


ఐర్లాండ్ లో మూడేళ్ళు విద్యాభ్యాసం. బాల్యాదీ, మాంసని షేధం. అప్పటికీ, యిప్పటికీ, యెప్పటికీ అంతే. పాశ్చాత్య దేశాల్లోనూ అంతే! దోసకాయముక్కలూ,టొమేటోలూ ఆహారం


జీవహింసచేసి జీవింతు ననుకంటె
జెట్టయెందుఁగూడఁ బుట్టఁబోదు.
జీవహింసమాని జీవింపరాదొకో -


అనీ సిద్ధాతం. పాశ్చాత్య దేశంలోకూడా వేషంలో మార్పేమీ లేదు. ఎక్కడకు వెళ్ళినా తలపాగా ప్రత్యక్షం, ఒక లేడీ రోమ్లో ఉన్నప్పుడు రోమన్ లా వుండాలి; నీవు



13