పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రా మ స్వామి గారు


వేసుకొని, బెత్తం తీసుకొని వూల్లోకి వెళ్ళారు. ఊల్లోగోల ఆ బెత్తం చాలారోజులవరకూ వారిదగ్గ రేవుంది.


రోజులు గడిచాయి. తమ సిద్ధాంతాలను వూరూరూ తిరిగి ప్రచారం మొదలు పెట్టారు. పురాణాలను సమ్మగూడ దనీ, దేవుడు లేడనీ, బ్రాహ్మణులు శూద్రులను పశువులకంటే నీచంగా చూస్తూవున్నారనీ, ఈ బానిసత్వాన్ని పోగొట్టు కోవాలనీ ఉపన్యాసాలు, ..ఫలితం ! రాళ్ళు రువ్వటం, రాక్షసుని చూచినట్టు చూడటం, వెళ్ళిన ఊళ్లో భోజనకంకూడ చిక్కక తిరిగిరావటం,


"పలనాటి వీరులపౌరుషం”, “రాణాప్రతాప్ నాటక ప్రచురణ సమాజాలు ప్రదర్శించటం నాటకాలు ప్రేక్ష కుల్లో ఉద్రేకాన్నీ పెంచటం_ప్రభుత్వం_ప్రభుత్వం పట్టుకుం టుందని అనుమానపడి "రాణాప్రతాప్" తగలబెట్టటం.....


కురుక్షేతసంగ్రామ పచురణ. ఆ రోజుల్లో పాండవు లంటే ఎతో పూజ్యభావం ! అప్పుడు పాండవులకంటే కౌర వులు నీతిపరులనీ, పాండవులకు 'రాజ్వార్హత లేదనీ వ్రాశారు ! ఇంకేముంది ? ఒక్కసారీ సంఘం గుప్పుమన్నది."చలనున్యు కొడుకు నాస్తికుడు' అని లోకం కోడై కూసింది. అగ్రజాతి ఒక్కసారి భగ్గున మండిపడింది. ఒక పత్రికలో ఒక విమర్శకుడు, ‘ఆముటెద్దులు" రెండు పోరాడుచుండ అనే పద్యాన్ని విమర్శిస్తూ, “శూద్రకవీ, శూద్రపోలికలూ ” అన్నాడు.

12