పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూత పు రాణ ము


పచ్చనిహోంబట్టు పరుపు వైచిసరీతి
బసరుఁగ్ర్రక్కెడి లతాప్రతతి యుండ
వెలిమబ్బుఁదెగఱించి తెలిసిన గొని తెచ్చు
సన్నని శృంగరాజమ్ము లుండ
ఏకోస గన రాని యెన లేని మందు మా
కులు వేరు వెల్లంలకు లలమియుఁండ
పిల్లి కూనల నైనఁ బెంపఁజాలిన నీరు
గొని కొండవాగులు చనుచునుండ


 వెండిపూతఁ బూసినభాతి వెలుఁగుచుండ
గొఱలి కనులకు మిరుమిట్లు గొలుపు చుణ్డ:
దోఁచు శృంగముల్ కంటిఁ గందోయినిండ.
మను వారికి: బెనుదండ మంచుకొండ,,


చదలదాఁకు మ్రాని మొదలు కుదులు పొదల
యదలు తుమ్మెదల రొదలు కథలు నదులు
విదులు క్రొందావి విరిగుత్తి పదులు పొరలు
మొదలు తుద లేని ముదిగొండి మొదలుగంటి.


గోలాంగూల లులాయ సూకర తరక్షు వ్యాళసుండాలశా
శార్దూల స్యంకు హరీంద్ర సాలముఖ జంతుప్రాప్త హింతాల త
క్కోల వ్యాఘ్ర తమాల తాళ వివిధ క్షోణీజంతానమా
భీలంబై కనుపట్టఁదుంగ హిమవద్భీమాటవీఘూటమున్ ,


8