పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వీ తీ యా శ్వా న ము


కొందఱు మరుభూమి కవలఁ
జెందిన దేశం బనీ తెగఁజెప్పీరి తుదకున్
సందడి బుట్టెను సభ లోఁ
గ్రందుగ నలుమూలల నవుఁ గాద'ను నుడులన్.

వారి వారించి మొలపుతో. వాలఖిల్య
సంయమీంద్రులు నావంకఁ జక్క-జూచి
కాయసిద్ధియు దీవ్య సంకల్పసిద్ది
కలుగువాఁడవు నీవేగి తెలిసిరమ్ము,


హిమవంతంబును దాఁటి మానవుల కెం తే వాసయోగ్యంబు కా
ని మహీభాగముఁజూచి మంచుపడు రానేలన్ విలోకించి వే
గమ యచ్చో వసియించు పంచజనులన్ గన్నార వీక్షించి సం
యమి లోకంబున కెల్లఁ దెల్పుమ'ని సంభాషిచి వాక్రువ్వఁగన్.


విని వెంటనే వింటి కెగసి
ఘనాఘనసమూహమధ్యగతుఁడ నగుచు బో
తిని మనీశ్వరు లాహా
యనీ దిక్కులుచూడ నుత్తరాభిముఖుఁడనై .


నదులు నిల్లని త్రాచు లసంగఁదోఁ
మలలు పిల్లల బొమరిండ్లు మాడ్కి - దోఁచె
గగనవీథిని వాయు వేగంబుతోడ
బఱచుచుండిన నాకు విభ్రమము గదుర.


7