పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథ మా శ్వాసము


పుట్టిననాటను గోలెను
బట్టిన శ్రీరామభక్తి పరతంత్రుండై
గొట్టినఁ దిట్టిన మెట్టిన
నెట్టినఁ దా నేమి యనక నిర్మోహుండై.


గతజన్మంబునఁ దండ్రి చెప్పిన నుడుల్ కైకోక సంసార దు.
ర్గతి బంధంబులఁ జిక్కుటం దెలిసి పూర్వజ్ఞాన సంపత్తి, సం
తత భద్రాచల రామచంద్ర చరణ ధ్యానంబుచే యోగియై
గతమోహుండయి సంచరించే సపవర్గ ప్రాప్తి జిజ్ఞానుఁడై ,



తెలుఁగునాడు నిరీహతోఁ దిరిగి తిరిగి
బ్రాహ్మణుండగు గోపన్న భక్తి యోగ
ము నుపదేశించి రామదాసునీ నొనర్చె
లోక సంసర్గమును మాని లోఁ దలంచి.


గేహము లేకపోయిన సకించనుఁడై- యొక చోట నేని గో
దోహానకాలమైనఁ దన త్రోవను నిల్వఁగఁబోక కర్మసం
దోహముఁ బాసి యస్యజన దుర్లభ మోకపదంబుఁ బొందెవ్యా
మోహము లేని సజ్జనులు ముక్తి పదంబును బొందు టబ్రమే ?


ఇట్లు శేషకర్మఫలంబు నెల్ల ననుభ
వించి మృతజీవుఁ డయ్యె గబీరుదాసు
మారు మూలలఁగూడ నీ పేరుఁ దెలియుగ
దెల్గువాఁడవు నీకిది తెలియదొక్కా !

183