పుట:Sinhagiri-Vachanamulu.pdf/27

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

కావచ్చునేమొ) పుటకు ఐదు పంక్తులున్నాయి. నెం. 1398గా ఇది Ante లో వర్ణింపబడ్డది. ఉదాహృత వచనం ముద్రితవచనాలతో సంవదిస్తోంది. ఇదే కుల శేఖరరావుగారు పేర్కొన్న పోయిన ప్రతి.—— దీనివివరాలు మద్రాసు ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంవారు 1937లో ప్రకటించిన డిస్క్రిప్టివ్ కాటలాగు ఆరవ సంపుటం వచనకావ్యాల్లో 1779వ పుటలో ఉన్నాయి.

కృష్ణమాచార్య సంకీర్తనము

కాగితపు ప్రతి. ఆర్. నెం. 1034. 9-1/2 X 10-1/2 పరిమాణములో ఉంది. 1933-34 సంవత్సరాల్లో డి. నెం. 2946 వ్రాతప్రతి నుంచి ఉద్ధరించేరు. అసమగ్రం. దీనివివరాలు 1949లో ముద్రింపబడ్డ మద్రాసు ప్రా. లి. పు. భాండాగారంవారీ ట్రయన్నియల్ క్యాటలాగు ఆరవ సంపుటలో 2237వ పుటలో ఉన్నాయి. ఇందులో ఆర్. నెం. 813 నుంచి 1064దాకా ఉన్న గ్రంధాల వివరాలున్నాయి. ఉదాహృతవచనంలో కృష్ణమాచార్యముద్ర (సింహగిరినరహరి నమో నమోదయానిదీ) కనపడలేదు. కాని మిగతా కృష్ణమాచార్యవచన లక్షణాలన్నీ ఇందులో ఉన్నాయి. ఆయన పేరూఉంది ఇందులో. కృష్ణమాచార్య కర్తృత్వ సాధనాలుగా మరి రెండు విషయాలు ఇందులో కనబడుతున్నాయి. 1. విదురునింటి విందా, పాండవపక్షపాతీ వంటి సంబోధనాలు. 2. శ్రీరాఘవేశ్వర. కృష్ణకుమార సంభోధనలు, మొదటి రెండు సంబోధనలూ ముద్రితవచనాల్లోనూ ఉన్నాయి కృష్ణ కుమారుడు——ముద్రితవచనాల్లో ఉన్న కృష్ణ కువ్వారుస్వామికాని మరొకరుకాదు. ఇక రాఘవేశ్వర సంబుద్ధి. ఇది కేవలం రఘునాధపరం కాదు. కృష్ణకుమారస్వామిలాగే యీ రాఘవేశ్వరస్వామి లేక రాఘవస్వామి కృష్ణమాచార్యులకు గురుస్థానీయులనితోస్తుంది, ముద్రిత వచనాల్లో 13వ వచనంలో “రాఘవభాష్య విశేషసుధామృత సంజీవనిష్ఠ" అనే ఒక ప్రయోగం యీ సందర్భంలో గమనించాలి. ఈ“రాఘవభాష్య" కర్త ఆ "రాఘవేశ్వరుడే కావచ్చును. ఈతనితో ఆచార్యులవారి సంబంధం ఎలాంటిదో అసలీయన ఎవరో తెలుసుకోవాలి. ఏమయినా యీ గ్రంథం కృష్ణమాచార్య వాజ్మయ దృష్టితో పరిశీలించదగింది.