పుట:Sinhagiri-Vachanamulu.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

ఒక విశిష్ట సంప్రదాయం నెలకొల్పేరు. కృష్ణమాచార్యులు సంస్కృతానుసారంగా కేవల పద్యపద్ధతిగాక, నన్నయగారి ననుసరించి చంపూ పద్ధతిగాక, వచన శైలిలో కవితా గానం వెలయించేరు. ఈ పద్దతికి తెలుగులో ఈయనే ఆద్యులు.

సింహగిరివచనాలు - గద్యతయపూర్వరంగం

అప్పటికే శ్రీవైష్ణవ సిద్ధాంత ప్రతిష్ఠాపనాచార్యులైన శ్రీ మద్రామానుజులు సంస్కృతంలో గద్యత్రయ బంధం కటాక్షించేరు. ఈ గద్యత్రయం శ్రీ వైష్ణవులకు నిత్యాను సంధేయంగా ఉపాదేయం. శ్రీ వైష్ణవులూ విశేషించి శ్రీమద్రామానుజులయందు ప్రగాఢ ప్రతిపత్తి కలవారూ అయిన కృష్ణమాచార్యులు గద్యత్రయాన్ని పలుమార్లు మననం చేసుకోవటం లోనూ, కవనశీలురూ దేశభాషాభిన నిష్టులూ అయిన ఆయన దాన్ని ఒరవడిగా గ్రహించి తెలుగులో కావ్యం వెలయించటంలోనూ అబ్బురం ఏమీ లేదు. "యామునార్యసుధాంభోధిమవగాహ్య" అని శ్రీమద్రామానుజులు తాము చెప్పినట్లే భగవద్యామునమునుల స్తోత్రరత్న శ్లోకవాక్య గర్భితంగా గద్యను వెలయించటంవల్ల అందులో చక్కటి వృత్త గంధిత విలసిల్లింది. కృష్ణమాచార్యులు సహజంగా గాయకులు, బఁధురభక్తి భావంతోపాటు సుమధుర కంఠనాదం కూడా ఆయన సొమ్మై ఉంటుంది. అంచేత లయతాళాను గుణంగా, రాగభావం ప్రస్పుటం ఆయేటట్లు వృత్త గంధి వచనాలతో సంకీర్తనం ప్రారంభించి గద్యత్రయంకంటే మరో మెట్టు పైకే వెళ్ళేరు . గద్యత్రయం పాఠ్యంగా మాత్రమే ఉండగా 'సింహగిరి వచనాలు' సంకీర్త్యమాణాలుగా, గేయాలుగా కూడా ప్రశస్తి కెక్కేయి అంటే ఇవి "తోలి తెలుగు వచన గేయా"లన్నమాట, గద్యత్రయం దీర్ఘ సమాసభూయిష్ట శైలీ విలసితం. కృష్ణమాచార్యులు సమాసాలుక్వాచిత్కంగా వాడినా దేశ తెలుగు పలుకుబళ్ళ ఆయనలో హెచ్చు. ఇది తత్కాల దేశవాసనా విజృంభణ ప్రభావాన్ని సూచిస్తుంది. గద్యత్రయంలో లక్షిపతియతిపతుల సంవాదం ప్రసక్తం. ఈ వచనాల్లోనూ సింహగిరి పతితో కృష్ణమాచార్యుల సంభాష