Jump to content

పుట:Sinhagiri-Vachanamulu.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సింహగిరి వచనములు

27

చండాలాదులకు పదవులు కలుగుట, యిది నీతిజగతికి జీవహింసకారుండైన మనుజుండు దానికి ఏకయత్నముగా బోషించును. తటుకున లేచును. పదతాళన చేసును, విడువకున్న వూలిగించం జూచుగాని ఆ భోగస్థితి యెరుంగడు. అశూన్యంబైన జంతువు ఆ విధంబుననే తిరుగుచుండును. కామాంధుడై , గర్వియై, నిర్వికారియై, మహాత్ముల గుణంబెరుంగక దూషింతురు. గాన, యతిరామానుజ మునివరందాతారు. అనాదిపతి, శ్రీకృష్ణకువ్వారు స్వామీ, సింహగిరి నరహరీ!

40

దేవా! ప్రాకృత జ్ఞానసుదర్శన పాంచజన్యంబులు శాంతశమదమాది గుణంబులు గాంభీర్యమునకు సరవి పల్ల రాదు. వాని స్వభావము మాన్పరాదు. ఆతండాడినట్లాడును. వారకాంత దెచ్చి యిల్లాలిగా నేలి, దానికి భారకంబు యిచ్చి మత్తుండై సంతతి వడసినన్నేమి, కులగోత్రము బంధువర్గంబులు సహోదరులు శోభన క్రతువులకు బిలువరు. ఆ వారకాంత స్వభావంబు మానుపరాదు, తా నడచే నడకలు నడవం జూచును. మరి జనము జూచును. ఉత్తమగుణంబులు దొరకవు. పుణ్యభార్యాంగనకు సరివచ్చునా? దేవా, భక్తులు నిని రక్తమాంసాదులు. అడిగెదిని నిర్బంధపు దైవములు గొందరింబట్టి లీలావినోదంబులు ఆడించుచు వారికి భయపడి మిమ్ము గొలువ నెరుంగని నీచగుణంబులవారు నీ మహత్త్వంబెరుంగరు. ఏకోవిష్ణు(ర్) మహద్బూతం బనియెడి సింహాద్రప్పను పూజింప నెరుంగరు. అజ్ఞానులకు సుజ్ఞానము దయ చేసి రక్షింపవే! ఆతుర జనబాంధవా!' శ్రీకృష్ణకువ్వారుస్వామీ, సింహగిరి నరహరీ!

41

దేవా, శాంత శమదమాది గుణంబులులేని శ్రీ వైష్ణవునికంటె శాంత శమదమాది గుణంబులుగల తిరునామ దారియె ప్రపన్నుండు. అటుగాన సాత్వికమె ప్రమాణము, శ్రీకృష్ణ కువ్వారు స్వామీ, సింహగిరి నరహరీ! తైలములేని జ్యోతిక్రియను.