పుట:Sinhagiri-Vachanamulu.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28

సింహగిరి వచనములు


39

దేవా, గార్దభంబునకు ఘంటానినాదంబులున్నె పక్కెన పల్లంబులు పూని దానికనేక తూర్యనాదభక్తిసములతో వచ్చిననేమి? కడుహీనముగా జూతురుగాని ఉత్తమాశ్వంబునకు సరివచ్చునా, దేవా, గార్దభంబు ......పల్యములతో స్మశానభూమిలోను పొరలాడజూచుగాని, అశ్వశాలాభ్యంతరమందు కరంబు అనాద్యంతపరిపూర్ణముగా మేపిన నేమి? అదియు దుర్గంధంబునంబడి ఘోటారంబు చేసును గాని. ఇటువలెనె గార్ధభజ్ఞానియైన మనుజుండు సుఖభోగ్యం బెరుగడు అల్పభోగమునకై అనేక అలమట మొందును, దాని గార్దభస్వరంబు మాన్పరాదు. దేవా, దుర్గంధహేతువైన కిరి పంకమధ్యంబున బొరలాడం జూచును. గ్రామ సూకరము దెచ్చి దానికి పన్నీటి అభిషేకంబు చేసి, కస్తూరి గంధలేపనంబు మెత్తి యెనెకరచుట వెట్టిచేందిచిన బృంహితంబు చేయుకాని, తన పూర్వస్థితి నరకరూపంబున నెప్పుడు బోయి ఉండును. వాని స్వభావత మాన్పరాదు. దేవా! ఉగ్రమదాంధకారుండైన మనుజుండు సదిరివల్న తనవద్దనున్న సమ్మోహంబెరుగడు. తన్ను నెరగడు. సర్వభోగసాయుజ్యంబులు విసర్జించును. ఆ కర్మములో మెలంగినప్పుడే లేమివల్ల వ్రయంబు చెప్పును. ఆ మనుజుండు మత్తగజంబై జనియించును. ఆ మనుష్యప్రకృతి యెరుంగక సూకరంబు మత్తగజంబునకు సరివచ్చునా! దేవా, స్నానంబును పంచభక్ష్యంబులు దెచ్చి భుజియింపపెట్టి పానుపుమీద శయనింపజేసిన జీవహింస కొరంబుమానునా? దేవా, మధువు గ్రహించు వాడొకడు, క్షౌరకుండొకడు, రజకుండొకడు, పూర్జుండైన దుష్టజంతువుండొకడు, పక్కెరపల్లంబు చేసెడి చర్మవైరి యొకడు, వెలిచండాలు లిద్దరు, వీరేడ్వురున్ను వారి సమానం సమకూర్పరాదు. జనులలో అంటముట్టరాని వారైనా గాక మీ నిజదాసుండయిన వారిని దూషించరాదు. జలములన్నియు నొక్కటి, దుగ్ధ.......... అన్ని కులంబులనొక్కటై సంతోషము నొక్కటె. కలిమిలేములు ఇవి రెండు కలియుగమున యేది నీతి. కలిమివలనంగాదా యీ చండాలాదులకు పదవులు కలుగుట. కులవర్ణాశ్రమధర్మంబు కులముగాదందురు, కులహీనులమందురు. కలిమివలన గాదా