Jump to content

పుట:Sinhagiri-Vachanamulu.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24

సింహగిరి వచనములు

ధరియించి యేకనామోచ్చారణంబులు చేసిన అతనికి పుత్రమిత్ర పౌత్రాభివృద్ధియు, ధనధాన్యసమృద్ధియు, కామితైశ్వర్యంబు లిచ్చి అంత్యమున అతనికి నాలోకంబు విత్తునని శంఖంబుపూరించి వేంచేసి(న?) కృతార్థుండనైతినని పరమభాగవతులున్ను, దాసులున్ను తనపురంబునకేగి, శ్రీకృష్ణకువ్వారు, సింహగిరి నరహరీ!

34

దేవా! మీతిరుమణి నాకొక్క దైవంబు. మీతిరుచూర్ణము నాకొక్క శృంగారంబు. మీ వనమాలిక నాకొక్క నవరత్నపుసొమ్ము(లు). ఈ జన్మమున నా కిటవలె జేస్తిరి, ఇంకొక జన్మంబుననైన నన్నుం గృతార్ధునింజేయవే. నన్ను రక్షింపవే. శ్రీకృష్ణ కువ్వారుస్వామీ. సింహగిరి నరహరీ!

35

దేవా! మహాప్రళయకాలమునాడు క్షీరాంబుధిమీద మాయావటపత్రశయనుండవై లక్ష్మీభూకాంతలతో నన్ను మరచితివో, దేవా! విళంబుస సంవత్సర ఆషాఢశుద్ధ ఏకాదశి ఈశ్వర సంవత్సరాలు మూటను, నా పుత్రమిత్రకళత్రాదులు అన్నబాంధవులు అన్నపానాదులు లేక క్షుత్పిపాసలు చెతనున్ను ఉన్నారు. గనుక, నే నీదాసుండను, నీవు నాపతివి, నన్నేల మాయాంధకారునిం జేసితివి? ఇహమందు సౌఖ్యభోగము కృపజేసి నన్ను రక్షింపవే. అనాదిపతీ సింహగిరి నరహరీ!

36

దేవా! నాలుగు వేదములు నవబ్రహ్మలు ఒకకొమ్మట! అందేయు చిటితాళము మీ దివ్యనామసంకీర్తనపరుండును ఒక కొమ్మట! వ్యాసపరాశరశౌనకాదులు ఋషులందరును గూ తులాభారము దూచిననాడు సంకీర్తనపరునికి సరితూగవాయెనట! అనేక జన్మజన్మాంతరముల నే బుట్టి సంకీర్తనపరుండే కావలయును, శ్రీకృష్ణకువ్వారుస్వామి, సింహగిరి నరహరీ!