పుట:Sinhagiri-Vachanamulu.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సింహగిరి వచనములు

23


31

దేవా, మనుజుండు పెద్దలైనవారల ఆచార్యుల మేదినీసురుల మాతృపితృ దేవతల హుంకారతిరస్కారంబులు చేసెనేని అనంతకోటికల్పంబులు రౌరవాది నరకంబులంబడి క్రిమికీటకాదులతోటి సంగతిని ఒకటియై జనియించును. అది యెట్లనిన చెప్పెద వినుండు. తొల్లి ఇంద్రద్యుమ్నుండను మహారాజు మహాత్ముల తిరస్కరించి కరియోనింబుట్టి కడపట మహాత్ముని కరస్పర్శనమున ముక్తుడాయెను. అది మీ రెరుంగరా, దేహంబు నీచుండైన నరుండు నిరంతరము శ్రీకృష్ణ కువ్వారుస్వామీ, సింహగిరి నరహరీ!

32

దేవా! మీదివ్యమంగళాది చారిత్రంబైన ద్వయతిరుమంత్రము పరమరహస్యము. అచార్యకృపాకటాక్షము దొరికిన మనుజుండు క్రితంబున సుజనుండైననేమి, దుర్జనుండైననేమి. అతండు మీదివ్యపదంబును బొందు. సకలజీవహింసలు చేసి మాంసము బం(ఖం?)డించేటి లోహము, వేదశాస్త్రపురాణంబులు వ్రాసేటి లోహములున్ను పరుసము సోకిన శుద్దసువర్ణముగదా! అనాదిపతీ, సింహగిరి నరహరీ!

33

దేవా, నేను ప్రభాతకాలమున లేచి తిరుమణి తిరుచూర్ణంబులు ధరియించి దండెయు తాళంబులు పూని, పరమభాగవతులున్ను దాసున్ను స్వామికోవెలకుంజని మిమ్ము స్రోత్రము సేయందోడంగిన, ద్రౌపదీమనోద్దారకా, పాండవపక్షపాతీ, సర్వసమా, మాధవా, గోవర్ధనగిరిధరా, నీవే దప్పనితఃపరం బెరుగనని స్వామి ప్రసన్నవదనుండై అప్పుడిట్లనియె. నీకు నింతవిచారంబేలా? నా నామోచ్చారణంబులు యెవ్వరేని పఠియించిరేని, చాతుర్లక్ష గ్రంథంబైననేమి, సహస్రంబైననేమి, అష్టోత్తరశతంబైననేమి, అంతకరణశుద్దిగాను ప్రభాతమందు లేచి తిరుమణియు తిరుచూర్ణంబులు