పుట:Sinhagiri-Vachanamulu.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సింహగిరి వచనములు

7

పారిజాతంబు గురుతిచ్చిన ఆ పరమభాగవతులు పారిజాతపుష్పంబు గురుతు గొంచు విమానారూఢులై పరమపదంబు వెడలి ఆ క్రిందట బ్రహ్మలోకంబు దాటి ఆక్రిందట ఈశాన్యంబు కైలాసము గడచి యాక్రింద ధ్రువమండలంబు భేదించి ఆక్రిందట నక్షత్ర మండలము ప్రవేశించి, ఆక్రింద చంద్రమండలంబు గడచి, ఆక్రిందట సూర్యమండలంబు గడచి, ఆక్రిందట మేఘమండలంబు దాటి ఆక్రిందట భూలోకంబున సింహాకారంబై యున్న సింహాచలంబునకు చనుదెంచి కృష్ణమాచార్యులను పొడగని తద్వృత్తాంతం బెరిగించి, పారిజాతపుష్పంబులు గురుతు ఇచ్చిన మహాప్రసాదంబని, సింహాచలంబునకు దశయోజనంబులునుగల వైష్ణవులను ఆచార్యులను, గల వైష్ణవులను,పరమభాగవతులను, వైఖానసులను, కాంతలను, బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్రజాతి సంఘముల రప్పించి, దివ్యమంత్రోపదేశంబువలన చరమ దేహంబు దిగనాడించి నిర్మలంబైన దివ్యదేహంబు ధరియించి, దివ్యవిమానారూఢులై పరమపదంబునకుం జనుదెంచెను. ఇందఱిం గృతార్థుల జెసెను, అందఱికి దివ్యమంత్రోపదేశంబు ప్రసాదించెను. అని దివ్యదేశంబుల జనులు ప్రసంగింతురు. మీరును నవమాసంబులు వేంచేసియుండి యీ భూమినేలు రాజునకు జ్ఞానోపదేశంబు చేసి మహాప్రసారంబును ఉభయకావేరిమధ్యంబున రంగనాథుల సన్నిధియందు తిరువధ్యయనంబొనరించి ఆ మీదట సాలోక్య సామీప్య సారూప్య కైంకర్యపరులై పరమపదంబునకు రమ్మని గడియలు పదునాలుగింటను ఒక్కముహూర్తంబున సాలోక్య సామీప్య సారూప్య కైంకర్యపరులై పరమపదంబునకు జనుదెంచిరి. అంతట పొతకమూరి లక్ష్మయ్యగారు మరలి వేంచేసి యా భూమి నేలెడు రాజుకుం చెప్పిన ఆనందబాష్పపూరితనయనుండై తన భృత్యులం బిలిచి, కృష్ణమాచార్యులు తమ దాసులు, దాను సాలోక్య సామీప్య కైంకర్యపరులై శ్రీ పురుషోత్తమము మొదలైన నూట ఎనిమిది దివ్యతిరుపతులకు జనుదెంచి వైకుంఠవాసులగుట సత్యం బని పలికిన ఆ రాజు విరక్తుండై తన యింటగల ధనద్రవ్యాదులు భాగవతార్పితంబు చేసి కాషాయవస్త్ర కమండలధారులై పొతకమూరి లక్ష్మయ్య