పుట:Sinhagiri-Vachanamulu.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6

సింహగిరి వచనములు

ఆ తిరువాయిముడిమండపంబునకు ప్రదక్షిణాకారంబు చేసి నిలువంబడి యున్నంత ఆ భాగవతులు శ్రీనగరి లోపలికి వేంచేయుడని యానతిచ్చిరి. ఆముందరనొక భద్రపీఠంబు గలదు. ఆ భద్రపీఠంబునకు దండము సమర్పించిన ఆభద్రపీఠంబునకు తూర్పుభాగంబున సహస్ర జిహ్వలుగల శేషుండుగలడు, ఆ శేషుని మధ్యాంతరాళంబునందు రత్నసింహాసనంబు గలదు. ఆ యనంతకోటి సూర్యప్రకాశంబు (న) ప్రజ్వరిల్లెడు రత్నసింహాసనంబుమీదను అప్రమేయు(డగు) ఆదినారాయణమూర్తి వేంచేసియుండును. ఆ జగదీశ్వరుని యుభయపార్శ్వంబుల అజభవరుద్రాదులు అనంత కోట్లు సూర్యచంద్రాదులు సహస్రకోట్ల కరయుగంబులు చనిన మనుష్యులు వేలసంఖ్యలు వేత్రదండహస్తులై సేవింప పరమపదనివాసులు పరివేష్టించియున్న ఆ పరమపదరాజులంబొడగని అనంతములైన సాష్టాంగములు సమర్పించి కృతాంజలియై గజగజవణకుచు నిలువంబడియున్న యాదాసునింజూచి ఆ జగదీశ్వరుండు ఏమనిబుషించెను. 'ఇంతకాలంబు ఏల ఆలస్యమాయె' నని ఆనతిచ్చిన 'స్వామీ! యింతకాలంబు భూలోకంబున సంసారంబనియెడు నరకకూపమునంబడి మునుగుచుందేలుచునున్నారమని, రక్షింపవేస్వామీ' యని పలికిన 'ఈ (ది)వ్యపదంబునకు ఎవ్వరియుప దేశంబు వల్లను వచ్చితి' వనిన 'స్వామీ మీదాసుండైన కృష్ణమాచార్యులు కలియుగ మందు నానాగమశ్రుతి పురాణేతిహాస మంత్రాక్ష(ర)రహస్యంబులు దెలిపె, చరమదేహంబు దిగనాడించి నిర్మలమైన దేహంబు (దిగనాడి!) అవధరింపంబడి మీదివ్యపదంబు గానుపించె'నని పలికిన ఆ సర్వేశ్వరుండు గాఢాలింగనంబు చేసి మేను నిమిరి పరమ(పద)నాంచారు దిక్కు చూచి యనేక కాలంబునాటికి 'కొమాళ్ళు' కలిగిరని పరమపదనాంచారు శ్రీహస్తమునకిచ్చిన ఆ పరమనాంచారు ఎత్తుకొని స్తన్యపానాదులచేత అమృతపాలంబు సేవింపజేసి వీరల నప్పటప్పటికి మనకొలువు కూటంబునకు తోడుకరమ్మని యానతిచ్చిన శ్రీనగరిలోపల ఉండుమని యొప్పగించిన అంతట నా నర్విరుండు(నారాయణుండు?) శ్రీ కృష్ణమాచార్యులకు సాలోక్యసారూప్య కైంకర్యము దయ చేసితిమి తోడుకొనుచు రమ్మని(న) భాగవతులంబనిచి (బిలచి) తమ చేతి