పుట:Sinhagiri-Vachanamulu.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సింహగిరి వచనములు

55

లేనునుం గలిగె. ఇట్టి పంచమహాభూతంబులకు సావధానంబులుగా స్వర్గ మర్త్య పాతాళంబులను జగత్రయంబుల నిర్మించె. స్వర్గంబున దేవతలును, మర్త్యంబున మనుష్యులును, పాతాళంబున రాక్షసులును నుండ నియమించె. తదీయాంతర్గతంబులయిన భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకంబు లనియెడు నేడు లోకంబులను, నతల వితల సుతల మహాతల రసాతల తలాతల పాతాళలోకంబులనియెడు నేడులోకంబులును, చతుర్దశభువనంబులును బ్రవరిల్లుచుండె. ఆ చతుర్ముఖునకు నాల్గువదనంబుల యందును ఋగ్యజుస్సామాధర్వణంబులను నాల్గు వేదంబులు ప్రవర్తిల్లుచుండె. వానియం దనంతంబులై వేదంబులు ప్రభవించె. అంత నయ్యజునకుఁ బ్రపంచనిర్మాణసహాయులై మరీచ్యత్రి భృగువిశ్వావస్వంగీరస పులస్త్య పులహ క్రతు దక్ష వశిష్ట నవబ్రహ్మ లుదయించిరి. మఱియు విశ్వదేవతలను, విశ్వకర్మ నారద సనకసనందన సనత్సుజాతాశ్విన్యాది దేవత లుదయించిరి. మఱియు వరుణుండును, ధ్రువుండును, సోముండును, నహుషుండును, నజయుండును, మృగుండును,మృగవ్యాహుండును, ననిలుండును నను నెనమండ్రు వసువు లుద్భవించిరి. స్వాయంభువ, స్వారోచిషోత్తమ తామసరైవత చాక్షుషవైవస్వత సూర్యసావర్ణి దక్షసావర్ణి బ్రహ్మసావర్ణి రుద్రసావర్ణి ధర్మసావర్ణి దేవసావర్ణి ఇంద్రసావర్ణి యను పదునలుగురు మనువు లుదయించిరి. అందొక్కని మన్వంతరంబునకు మనుపదంబున నుండ నియమించి మనుసహాయులైన ధాతయు విధాతయు నుద్భవించిరి. మఱియు శంకరుండును, స్థాణుండును, శర్వుండును, మృగవ్యాధుండును, నేకపాదుండును, జక్షకుండును, నహర్భధ్యుండును, పినాకియుఁ, బావకేశ్వరుండును, గపాలుండును, ననపేతుండును ననురుద్రు లుదయించిరి. వానియందు గణపతియు, షణ్ముఖుండును, నుదయించిరి. శ్రీమహావిష్ణువునకు మన్మథుండును, మోహ(న) స్తంభన వశీకరణ సంతాప నాకర్షణోచ్చాటన ప్రపంచ పంచబాణ నిరంచిత సకల ప్రపంచితులు