పుట:Shriiraavu-Vanshiiyula-Chaaritramu.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ii

దిన ప్రవర్థమానులై శాఖోపశాఖలు గల్గి మన యాంధ్రదేశ మందంతటను పెక్కు సంస్థానములను సంపాదించి ప్రసిద్ధివడసి యున్నవారు. ఆ సంస్థానము లన్నిటిలో గల్గిన పౌరుషాదికములన్నియు మూర్తీభవించి యొకచోట నిలిచెనా యనునట్లుగ నవియన్నియు నీబొబ్బిలి సంస్థానములోఁ గాన్పించుటంజేసి యట్టి సంస్థానీకుల వృత్తాంతము నుడువుటకుఁ బూర్వము వారి కులమగు పద్మనాయక కులగోత్రాదుల వివరమును, యొక్కొక గోత్రమువారి బిరుదములును, వారిలోఁ బ్రతాపరుద్రునికడ సేనానులుగానుండు పురుషుల నామవివరణముచేసి యనంతరము పద్మనాయకశబ్ద' నిర్వచనపూర్వకమగు నన్యజన పూర్వపక్షఖండనమును, శిలాశాసన తామ్రశాసనముల మూలముగా గోత్రప్రవరల నేర్పరించిన కాకతీయప్రతాపరుద్రవైభవ వర్ణనయును, ఆరాజు కాలనిర్ణయముం జేయంజాలిన యొక శాసనమును వివరింపఁబడిన లెస్సయని యెంచి యీగ్రంథముయొక్క ప్రారంభములోఁ బైగాధలతోడనె చేయం దలఁచినాడను.

గురజాడ శ్రీరామమూర్తి.




___________