పుట:Shriiraavu-Vanshiiyula-Chaaritramu.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

ఈచారిత్రమును నేను వ్రాయునట్లుగా సంకల్పించిన ప్రస్తుతపు సంస్థానాధిపతులవలన నాకుఁ గల్గింపఁబడిన గౌరవాతిశయమునకుఁ బరమానందమునంది వారియెడల నేనెంతయుఁ గృతజ్ఞుఁడ నగుచున్నాఁడను. సంస్థానములయొక్క పూర్వపు వృత్తాంతములు తెలుపు గ్రంథసామగ్రి విశేషించి లభియింప కుండుటచేత నాకు లభియించిన మిక్కిలి కొంచెపు సాధనముల ననుసరించి యింత ప్రాచీనకుటుంబముయొక్క చారిత్రము వ్రాయఁ గమకించుట నాయతిసాహసతను దెలుపకపోదు. అట్టి సాహాసకృత్యమును మన్నింపఁ బండితప్రభువులను బ్రార్థింపుచు నాకడనున్న సాధనసామగ్రిని నేకముఖము చేసిన భవిష్యత్కాలమునందలి చరిత్రకారులకుఁ గొంత సహాయముఁ జేసినట్లగునని యిపుడీగ్రంథారంభము చేయుచున్నాఁడను.

యీ చరిత్ర మెటనుండి యేవిధముగఁ బ్రారంభించవలయునని యోచించుతఱి నొక పూర్వ వృత్తాంత మీ గోత్రజుల యది జ్ఞప్తికి వచ్చినది. అది యెద్దియనఁగా :— పద్మనాయక చరిత్రములో వివరింపఁబడిన రావుబ్రహ్మనృపతి యను పురుషశ్రేష్ఠుఁడు మహాగౌరవములనందిన తమ కులమువారి గోత్ర బిరుదావళీ ఖండనను ప్రకటింపం జేసెనను కార్యమైయున్నది. అట్టి పురుషుని కులమువారును వంశమువారును దిన