పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

నిలువఁబడి యుద్ధము చేయుదురో లేక యడవికిఁ బోయెదరో యేమి చెప్పఁగలను. నే నిటు లంటినని మీ రేమియు ననుకొనవలదు. నీకును బాండవులకును గౌరవము చెడకుండ సంధికార్య మెటుల జరుగునో యటులఁ జేయుఁడు." అటుమీఁద దనవస్త్రాపహరణవిషయమునుఁ జెప్పుకొనెను.

యుద్ధానంతరమున నశ్వత్థామ నిద్రాసమయమున దన యైదుగురుకుమారులను సోదరులను దక్కనపాండవవీరులతో పాటుగ గొంతులుగోసి చంపినందున నీమే శోకావేశముగలది యై యాఘాతుకునిమీఁదికి భీమునిఁ బంపుట మొదలగు విషయము లశ్వత్థామార్జునచరిత్రములలో వ్రాయఁబడి యున్నవి. తుద కీమె భర్తలతోఁ గలిసి యడవి కేగి స్వర్గస్థురాలయ్యెను.

10. అభిమన్యుఁడు

ఇతఁడు సుభద్రార్జునుల కుమారుఁడు. తనతండ్రివలన నస్త్రవిద్య నేర్చికొని యతనివలెఁ బ్రసిద్ధిలోనికి వచ్చుచుండెను. ఈతని యుద్ధపునేర్పునుఁ జూచి భీష్మాదులును మెచ్చుకొని యున్నారు. మరియు నితఁడు పాండవులందరకు బ్రియతముఁడగు నందనుఁడు. విరటరాజుకూతురగు నుత్తరను వివాహ మయ్యెను. ఆమెయందు బరీక్ష న్మహారాజును గనెను. పదుమూడవనాఁటియుద్ధమున దనతండ్రియగు నర్జునుఁడు సంశప్త