పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

59

శ్రీకృష్ణులవారు రాయభారమున కరుగునపుడు వారితోఁ బాండవులు వారువారు చెప్పవలసినవి చెప్పినపిదప నదివరకు ధర్మరాజు చెప్పినమాటలు తనకు హృదయతాపము గలిగింప గోపముతో నిట్లు పలికెను.

"మాకు నేనకము లగుకీడులు చేసి యడవికిఁ బోదోలి యిప్పుడు మాయందు బ్రేమ మున్నటుల సంజయునిఁ బంపఁగా నంతమాత్రమున కీధర్మరా జూప్పొంగెను. ఈపొంగు జూచి యన్నదమ్ముల యందుఁ బ్రీతి గలిగి సుయోధనుఁ డైదూళ్లనైన నియ్యకపోవునా యని పాపము ధర్మరాజు నమ్మియున్నాఁడు. పూర్వము తనపడినపాటులను దలఁపక యీధర్మరాజు దుర్యోధనుని భ్రాతృవాత్సల్యముతోఁ జూచును గాఁబోలు? అది బాగా ? రాజ్యభాగమునుఁ దీసికొననియెడల లోకులు నిందింపరా! చేతగానివారని యనరా ! తమయాధిక్యమును బోఁగొట్టుకొని యీవిధముగ లోఁబడి తక్కువమాట లేల యాడవలెను ? నిజముగ నీసంధివలన గౌరవులకే మేలు. సోదరులని కనికరింతు రేమో కాని యుద్ధమునందు వారినిఁ జయించుట కింత కావలెనా? తప్పుచేసినపుడు మన్నించుటకు వారు బ్రాహ్మణులా! దుర్యోధనునకు సంకోచ మేమియు లేదు. నీవు చెప్పు తీపుమాటలకు దుర్యోధనునకు దురభిమానమే హెచ్చును. వారు యుద్ధముచేయుదు మన్నపు డీపాండవులు