పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

యుద్ధము తప్పక జరగునని కౌరవసభలో నేను జెప్పినటుల చెప్పుము" అని పలికెను. కపటద్యూత మాడి తమ్ము నోడించినశకునిని యుద్ధమునందు జంపెను. తుదను దనయన్నలతోఁ గలిసి మహాప్రస్థానము చేసి పరలోకగతుఁ డాయెను.

9. ద్రౌపది.

ఈయమ ద్రుపదమహారాజు ముద్దులపట్టి. కుంతీదేవి వచనమువలన బాండవు లైదుగురికిని భార్య యయ్యెను. కౌరవసభయందు దనవస్త్రాపహరణసమయమున భర్త లుండియు దా ననాధురాలివలె నయినందున ద్వారకలో నుండు శ్రీకృష్ణులవారినిఁ బ్రార్థింపఁగా నాతనిమహిమవలన విప్పఁ బడినవస్త్రమునకు బ్రతివస్త్ర మమర్పఁ బడుచు వచ్చెను. ఈ యద్భుతకార్యమునకు సభ్యు లచ్చెరువంది యామెకు మానభంగము కానందుకు సంతసించిరి. అరణ్యవాసమున నీమె పాండవులకును వారిపరివారమునకును భోజనాదికృత్యములు జరుపుటలో నతిజాగ్రత్తగ గనిపెట్టుచుండెను. శ్రీకృష్ణులవారు సత్యభామాసమేతులయి యరణ్యమునందున్న పాండవులను జూచుకొఱకు వచ్చినపుడు సత్యభామకును ద్రౌపదికిని జరిగిన సంవాదము స్త్రీలు ముఖ్యముగ దెలిసికొనవలసిన విషయమయినందున యథామాతృకముగ నీక్రిందఁ బొందుపరుపఁబడెను:-