పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

39

నాలుక గోయక మరలెను. శల్యుఁడును గర్ణుని నావిధముగఁ గాపాడెను. నాటిదినముననే దుశ్శాసనుని గ్రిందఁ బడవైచి భీముఁ డతనివక్షస్థలమునుఁ జీల్చి హృదయరక్తమునుఁ ద్రాగి ప్రతిజ్ఞ నెరవేర్చుకొనెను.

పదు నెనిమిదవనాఁడు దుర్యోధనుని గదాయుద్ధములో దొడలు విరుగగొట్టి రెండవప్రతిజ్ఞను నెరవేర్చుకొనెను . అయితే అట్లు క్రిందఁబడియున్న రారాజుతలను రెండుమారులు తన్నెను. అది సరికా దని భీముని ధర్మరాజు తూలనాడెను. సౌప్తికవధానంతరమున నశ్వత్థామను బట్టుటకు ద్రౌపదిపనుపున నేగెను. ఆపయిని జరిగినకథ యశ్వత్థామచరిత్రమున వ్రాయఁబడియున్నది. పాండవులలోనే కాక పాండవసేనలోఁగూడ నింతధైర్యశాలి యభిమన్యుఁడు తప్ప మరియెవ్వఁడును లేఁడు.

6. అర్జునుఁడు.

ఇతఁడు పాండుమహారాజునకు మూఁడవకుమారుఁడు. శ్రీకృష్ణులవారిసఖుఁడు. ద్రోణాచార్యునియొద్ద సస్త్రవిద్య నభ్యసించినవారిలో నధికుఁడు. కావున నతనికి ముఖ్యశిష్యుఁడు. దేవతలందరిలో నింద్రుఁ డెట్టు లధికుఁడో యటుల నప్పటి కాలపుబ్రసిద్ధవీరులలో నితఁ డధికుఁడుగావున నింద్రాంశ సంభూతుఁడని యెన్నిరి. గురువునాజ్ఞచొప్పున ద్రుపదపురమున