పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

కేగి యితరశిష్యులకు సాధ్యముకానియప్పు డీయర్జునుఁ డా ద్రుపదునిఁ బట్టి తెచ్చి గురువునకు దక్షిణగా సమర్పించెను.

ద్రౌపదీస్వయంవరమునకుఁ బోవునపు డంగారపర్ణుఁ డనుగంధర్వుని యుద్ధమున నోడించెను. ఆపిదప ద్రుపదపురమునకు జేరి రాజమండలము చూచుచుండఁగా వారి కసాధ్యమయిన మత్స్యయంత్రమునుఁ గొట్టి ద్రౌపదిని వీర్యశుల్కగాఁ బడసెను. అప్పుడు తనపయి యుద్ధమునకు వచ్చిన కర్ణశల్యాది వీరులను భీమసహాయుఁడై జయించెను. ముందా సభలోఁ గూరుచుండునపుడు బ్రాహ్మణవేషధారులగు నీపాండవులను శ్రీకృష్ణులవారు మాత్రము గురుతుపట్టి బలరాములవారికిఁ దెలియఁజేసిరి. తక్కినవారు వీరి నెఱుఁగరు. అటుల దెచ్చిన ద్రౌపదిని దల్లిమాటనుబట్టి నలుగురు సోదరులతో వివాహ మాడెను. ఇట్లు వివాహ మాడి కొంతకాల ముండినపిదప దీర్థ యాత్రలకుగా నర్జునుఁడు బయలుదేరి ముందుగ గంగాద్వారమున కేగి నాగు లనుతెగవారి రాజపుత్రికయగు నులూచిని విహహ మయ్యెను. అచటినుండి దివ్యనదులలో స్నానము జేయుచుఁ గ్రమముగ బదరీనారాయణము, గయ, శ్రీజగన్నాథము, భీమేశ్వరము, శ్రీశైలము, కావీరీసాగరసంగమము సేవించి మణిపూరపురముఁ జేరెను. ఈపట్టణము మలయాళ దేశములోనిదై యున్నది. అచటి రాజకుమార్తెయగు చిత్రాం