పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

4. యుధిష్ఠిరుఁడు.

ఇతఁడు పాండుమహారాజు జ్యేష్ఠకుమారుఁడు. ధర్మాధర్మ వివేచనమందు మిగుల బట్టుదల గలవాఁడు కావున ధర్మరాజని ప్రసిద్ధి కెక్కెను. ఈ ధర్మాధర్మవిషయములో నితనికి గలపట్టుదల భారతగ్రంథములో బెక్కుచోటుల గనఁబడుచుండినను శాంత్యానుశాసనికపర్వములలో భీష్ముని నితఁ డడుగుప్రశ్నలనుబట్టిచూడఁగాఁ జదువరులకు స్పష్టముగ దోఁపక మానదు. మరియు ధర్మమునకు గట్టుబడుటలో నితనిని మించినవాఁడు లేఁడు. ఏల యనిన : భార్యావస్త్రాపహరణ కాలమున నితనివలె ధర్మమునకు గట్టుపడియుండినభర్త మరి యుండడు కదా? అందునుబట్టియు నాకాలమున జూదమునకు బిలువఁబడినపుడు నిరాకరించుట కూడనిపని యనుబ్రసిద్ధి ననుసరించి మొదటిద్యూతమునకు వచ్చి కపటముగ నోడింపఁబడి దానిం దెలిసియు రెండవసారి జూదమునకు బిలువఁబడి యేగి యోడి యరణ్యాజ్ఞాతవాసములలో శ్రమను బొందెను. దీనివలన నీతని నతిధర్మరా జని చెప్పవచ్చును. (అతి సర్వత్ర వర్జయేత్) ఇతనికి జూదమునం దెంత యాసక్తియో కాని యజ్ఞాతవాససమయమందు యతివేషమును దాల్చియు విరట రాజుతో నెల్లప్పుడు బాచిక లాడుచునే యుండెను. ఎవరికి గాని యెట్టివ్యసనములయందైనను నావ్యసనములకు దానులై